For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒకే వ్యక్తితో శ్రీదేవి కూతుళ్లు డేటింగ్: ఒకరికి తెలియకుండా మరొకరు.. తొలిసారి పెదవి విప్పిన జాన్వీ

  |

  అతిలోక సుందరి అనే పదానికి అసలైన నిర్వచనంలా ఉంటూ ఎన్నో ఏళ్ల పాటు సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన ధృవతార శ్రీదేవి. సుదీర్ఘ కాలం పాటు ఇండియన్ సినిమాపై తన ప్రభావాన్ని చూపించిన ఆమె.. తన కూతుళ్లను కూడా చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. అలాగే, చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా యమ ఫాలోయింగ్ సాధించి దూసుకెళ్తోంది. ఇలా ఇద్దరూ నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుని ముందుకెళ్తోన్నారు. ఈ నేపథ్యంలో జాన్వీ, ఖుషీ ఇద్దరూ ఓ బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్ చేస్తున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అసలేం జరిగిందో మీరే చూడండి!

  చిన్నప్పుడే జాన్వీ డేటింగ్‌లు

  చిన్నప్పుడే జాన్వీ డేటింగ్‌లు

  శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయం అయింది. చిన్న వయసులోనే వివాదాస్పద తీరుతో ఈమె చర్చనీయాంశం అయిపోయింది. అప్పట్లో అక్షత్ రంజన్ అనే కుర్రాడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ భామ.. ఆ తర్వాత శిఖర్ పహారియా అనే అబ్బాయితో ప్రేమాయణం సాగించింది. వీళ్లతో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు అప్పట్లో కలకలం రేపాయి.

  శృతి మించిన అఖండ హీరోయిన్ హాట్ షో: వామ్మో గీత దాటేసిందిగా!

  హీరోయిన్‌గా వరుస మూవీలు

  హీరోయిన్‌గా వరుస మూవీలు

  జాన్వీ కపూర్ 'ధడక్' అనే మూవీ పరిచయం అయింది. ఇది సూపర్ హిట్ అవడంతో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆ తర్వాత ఆమె 'గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌' అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది. అయితే.. ఆ తర్వాత నటించిన మరో ప్రయోగాత్మక చిత్రం 'రూహీ' మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది. అయినా సినిమాలు చేస్తూనే ఉంది.

  అది ఆడలేదు... మిలీ మూవీ

  అది ఆడలేదు... మిలీ మూవీ

  కొంత కాలంగా బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. ఇటీవలే ఈ అమ్మడు 'గుడ్ లక్ జెర్రీ' అనే మూవీతో వచ్చింది. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు ఆశించిన రీతిలో స్పందన దక్కలేదు. ఇక, బోనీ కపూర్ నిర్మిస్తోన్న 'మిలీ' అనే సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా నటించింది. ఇది నవంబర్ 4న రాబోతుంది. దీనితో పాటు 'దోస్తానా 2'లోనూ చేస్తోంది.

  బోల్డు షోలో హద్దు దాటిన అనన్య నాగళ్ల: కుర్రాళ్లకు ఇది కదా అసలైన విందు

  జాన్వీ కపూర్ డేటింగ్ న్యూస్

  జాన్వీ కపూర్ డేటింగ్ న్యూస్


  చిన్న వయసులోనే పలువురితో డేటింగ్ చేసి జాన్వీ కపూర్ ఫుల్ పాపులర్ అయిపోయింది. అలాగే, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆమె పలువురు యంగ్ హీరోలతో చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా జాన్వీ కపూర్.. అక్షత్ జైన్ అనే బడా బిజినెస్‌మ్యాన్‌తో డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

  ఖుషీ ఫేమస్.. డేటింగ్‌తోనే

  ఖుషీ ఫేమస్.. డేటింగ్‌తోనే


  జాన్వీ కపూర్ సోదరి ఖుషీ కపూర్ సినిమాల్లో నటించకున్నా దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలోనూ ఆమె ఎంతో రచ్చ చేస్తుంటుంది. అలాగే, డేటింగ్ వార్తలతోనూ ఆమె బాగా హైలైట్ అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆమె కూడా తన అక్కకు తెలియకుండా అక్షత్ జైన్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో శృతి హాసన్: లోపలివి కనిపించేలా ఘోరంగా!

  క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

  క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

  జాన్వీ కపూర్ నటించిన 'మిలీ' చిత్రం నవంబర్ 4వ తేదీన విడుదల కాబోతుంది. దీంతో ఆమె సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో ఖుషీ, జాన్వీ ఒకరికి తెలియకుండా ఒకరు అక్షత్ జైన్‌తో డేటింగ్ చేస్తున్నారన్న వార్తలను మీడియా ప్రతినిధులు ఆమె దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో జాన్వీ కపూర్ ఈ వార్తలపై స్పందిస్తూ వాటిని కొట్టి పారేసింది.

  వేస్ట్ రూమర్స్‌ అంటూనే

  వేస్ట్ రూమర్స్‌ అంటూనే

  డేటింగ్ వార్తలపై జాన్వీ కపూర్ ఘాటుగానే స్పందించింది. 'నేను కానీ, మా సిస్టర్ (ఖుషీ కపూర్) కానీ ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదు. మా గురించి వచ్చే వార్తలను ఎవరూ నమ్మకండి. ఇలాంటి చెత్త రూమర్లపై నేను కానీ, నా అభిమానులు కానీ స్పందించాల్సిన అవసరం కూడా లేదు. దయచేసి మీడియా ఇలాంటి వాటిని ప్రచారం చేయొద్దు' అంటూ చెప్పొచ్చింది.

  English summary
  Sridevi Daughter, Bollywood Heroine Janhvi Kapoor Recently Participated in Media Chat. Now She Gave Clarity on Dating News.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X