పెళ్లి విషయంలో మరోసారి జాన్వీ కపూర్ కామెంట్.. తిరుపతిలో ప్లాన్ అంటూ..
శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. గ్లామర్ రోల్స్ కంటే కూడా అమ్మడు ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తోంది. ఇక ప్రతి ఇంటర్వ్యూలో జాన్వీ తన పెళ్లి మ్యాటర్ డేటింగ్ గురించి ఎదో ఒక విధంగా కామెంట్ చేస్తూనే ఉంది. రీసెంట్ గా ఆమె తన పెళ్లి విషయంలో మరోసారి కామెంట్ చేసింది.
శ్రీదేవికి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంతో ప్రత్యేకమైన భక్తి అని అందరికి తెలిసిన విషయమే. అయితే తల్లి తరహాలోనే జాన్వీ కపూర్ కూడా తరచుగా తిరుపతికి వచ్చి శ్రీవారిని దర్శించుకుంటు ఉంటారు. ఇక మిలి సినిమా ప్రమోషన్ లో భాగంగా జాన్వీ కపూర్ తనకు తన పెళ్లి గురించి ఒక కామెంట్ చేసింది. తాను పెళ్లి చేసుకుంటే సౌత్ ఇండియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని ఎందుకంటే ఇక్కడ ఆచారాలు మనుషులు కూడా నాకు ఎంతో ఇష్టము అని వివరణ ఇచ్చింది.

అంతే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం నాకు మాత్రమే కూడా ఎంతో ప్రత్యేకమైన దైవమని.. ఇక పెళ్లి చేసుకుంటే తిరుపతిలోనే చేసుకుని అక్కడే స్థిరపడతాను అని కూడా జాన్వీ కపూర్ తెలియజేశారు. భవిష్యత్తులో నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్తను ఇదే విషయంలో చాలా బ్రతిమాలాతాను అని కూడా ఆమె సున్నితంగా తెలియజేసింది. ఇక జాన్వికపూర్ గత కొంతకాలంగా ఓర్హాన్ అనే ఒక యువకుడితో ప్రేమలో ఉన్నట్లు టాక్ వస్తున్న విషయం తెలిసిందే. ఇంతవరకు ఆ విషయంలో ఆమె ఎక్కడా అధికారికంగా క్లారిటీ ఇచ్చింది లేదు కానీ డేటింగ్ లో ఉన్నట్లు తరచుగా బాలీవుడ్ మీడియాలో అయితే కధనాలు వెలువడుతున్నాయి. ఇక జాన్వి కపూర్ నటించిన మిలి సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఇక కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే కాకుండా ప్రస్తుతం ఆమె మరికొన్ని సినిమాలు కూడా చేస్తోంది.


Click it and Unblock the Notifications











