Janhvi Kapoor Boyfriend: అతని గురించి క్లారిటీ ఇచ్చిన జాన్వీ.. చాలా కాలంగా తెలుసంటూ..

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వి కపూర్ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా పెద్దగా గ్యాప్ లేకుండా అవకాశాలు అందుకుంటూనే ఉంది. ఇక ఈ బ్యూటీ ఇటీవల మిలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నా జాన్వి అప్పుడప్పుడు తన డేటింగ్ రూమర్స్ పై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక అమ్మడు ఇటీవల జాన్వి డేటింగ్ రూమర్స్ పై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

సోలోగా సక్సెస్..

సోలోగా సక్సెస్..

శ్రీదేవి బోని కపూర్ గారాల కూతురు జాన్వీ కపుర్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలమైనప్పటికీ కూడా ఇంకా ఆమెకు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ మాత్రం రాలేదు. ఎలాంటి సినిమా చేస్తున్న కూడా పూర్తిస్థాయిలో ఫలితాన్ని ఇవ్వడం లేదు. దానికి తోడు ఆమెపై ట్రోలింగ్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి కతగ్గకుండా జాన్వీ కపుర్ తన టాలెంట్ తోనే సోలోగా సక్సెస్ అందుకోవాలని ఆశపడుతోంది.

అతనే బాయ్ ఫ్రెండ్

అతనే బాయ్ ఫ్రెండ్

అయితే జాన్వీ కపుర్ గత కొంతకాలంగా ఒక ప్రముఖ బిజినెస్ మాన్ వారసుడితో డేటింగ్ లో ఉన్నట్లుగా కథనాలు వెలుతున్నాయి.. అసలైతే మొదట ఆమె ఒక యువ హీరోతోనే ప్రేమలో ఉన్నట్లు కథనాలు వెలుపడ్డాయి. కానీ ఆ తర్వాత జాన్వి కపూర్ ఒర్హాన్ అనే ఒక వ్యక్తితో తరచుగా కనిపించడంతో అతనే ఆమె బాయ్ ఫ్రెండ్ అని బాలీవుడ్ మీడియాలో తరచుగా కథనాలు వెలువడుతున్నాయి..

విహారాయత్రలు

విహారాయత్రలు

అయితే జాన్వీ కపుర్ అతనితో ప్రేమలో ఉంది అని డేటింగ్ చేస్తుంది అని వివిధ రకాల వార్తలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా వాటిపై పెద్దగా స్పందించింది లేదు. కానీ ఆ రూమర్స్ పై క్లారిటీ ఇవ్వక పోయినప్పటికీ కూడా ఆమె చాలాసార్లు అతనితో కొన్ని విహారయాత్రలు చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రతీసారి గాసిప్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయి.

ఎల్లప్పుడూ సపోర్ట్

ఎల్లప్పుడూ సపోర్ట్

ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఓర్హన్ గురించి ప్రత్యేకంగా వివరణ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది అతను నాకు చాలా కాలంగా తెలుసు ఒక మంచి స్నేహితుడిగా నాకు ఎల్లప్పుడూ సపోర్ట్ గా ఉన్నాడు. ఒక విధంగా అలాంటి ఫ్రెండ్ దొరకడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఏ విషయంలో అయినా మద్దతుగా ఉంటాడు. అంతేకాకుండా నేను అతన్ని చాలా నమ్ముతాను. అతను నాకు ఒక గొప్ప వ్యక్తి అంటూ జాన్వి కపూర్ వివరణ ఇవ్వడంతో వీరికి సంబంధించిన వార్తలు మరింతగా వైరల్ అవుతున్నాయి.

పెళ్లి అయితే అక్కడే..

పెళ్లి అయితే అక్కడే..

ఇక జాన్వికపూర్ గతంలోనే తన పెళ్లి గురించి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. తన తల్లి కోరిక మేరకు పెళ్లి మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ సంప్రదాయ ప్రకారం చేసుకుంటాను అని తెలియజేసింది. ఇక తరచుగా జాన్వీకపూర్ తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. తన తల్లికి తిరుమల దేవస్థానం ఎంతో ప్రత్యేకమైనది అని ఆమె వెంకన్న ఇష్ట దైవం అని కూడా ఆమె పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు. ఇక త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ కూడా ఉంటుంది అని జాన్వి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X