Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్ తో కారులో దొరికిపోయిన జాన్వీ.. మొహాన్ని దాచుకుంటు..

బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తన రేంజ్ ను పెంచుకోవడానికి భిన్నమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. అయితే ఆమె ఎంత కష్టపడినా కూడా బాలీవుడ్ లో మాత్రం సరైన సక్సెస్ ఇంతవరకు రాలేదు. అయితే జాన్వీ కపూర్ ఇటీవల కాలంలో మాత్రం ప్రేమలో మునిగి తేలుతోంది అని బాలీవుడ్ మీడియాలో కూడా రకరకాల కథనాలు అయితే వెలువడుతున్నాయి. అంతేకాకుండా ఆమె బాయ్ ఫ్రెండ్ తో కారులో కూడా దొరికిపోయింది. అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

గ్లామరస్ బ్యూటీగా..

గ్లామరస్ బ్యూటీగా..

అతిలోకసుందరి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ గ్లామరస్ హీరోయిన్ గా ఇప్పటికే మంచి గుర్తింపును అందుకుంది. ఆమె తన అందంతోనే ఇప్పటివరకు చాలా ఎక్కువ స్థాయిలో అవకాశాలను అందుకుంటూ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ లేకపోయినప్పటికీ కూడా ఆమెకు వివిధ రకాల ప్రొడక్షన్ హౌస్ ల నుంచి సపోర్ట్ అయితే బాగానే లభిస్తోంది.

జాన్వీ బ్యాడ్ లక్

జాన్వీ బ్యాడ్ లక్

జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి చాలాకాలం అయినప్పటికీ కూడా ఇంతవరకు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. అయితే ఆ మధ్య గుంజన్ సక్సెనా బయోపిక్ లో నటనతో మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఆ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాను చూసిన కొంతమంది సినీ ప్రముఖులు జాన్వీ నటనపై పాజిటివ్ గా స్పందించారు.

రెగ్యులర్ సినిమాలు కాకుండా..

రెగ్యులర్ సినిమాలు కాకుండా..

అయితే జాన్వీ కపూర్ ఎలాగైనా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోవాలి అని బాగానే హార్డ్ వర్క్ చేస్తుంది కానీ ఆమెకు అదృష్టం కలిసి రావడం లేదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయకుండా విభిన్నమైన తరహాలో ఆమె కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది కానీ అవి కూడా సరైన కలెక్షన్స్ మాత్రం అందుకోవడం లేదు.

ప్రేమలో జాన్వీ

ప్రేమలో జాన్వీ

అయితే ఇటీవల జాన్వీ కపూర్ సినిమా వార్తల కంటే కూడా బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన వార్తలతోనే ఎక్కువగా వైరల్ అవుతొంది. గతంలోనే ఒక బాలీవుడ్ హీరో తో ప్రేమలో ఉంది అని అనేక రకాల వార్తలు అయితే వైరల్ అయ్యాయి. కానీ అందులో నిజం లేదు అని ఆమె సన్నిహితులు చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె ఒక బిజినెస్ మెన్ కొడుకుతో ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా మరో కొత్త తరహా వార్తలు అయితే మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

బాయ్ ఫ్రెండ్ తో జాన్వీ

జాన్వి కపూర్ తన ప్రేమ విషయం గురించి ఎప్పుడూ కూడా బయటకు చెప్పింది లేదు. ఇక ఇప్పుడు మాత్రం ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె గత రాత్రి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి డిన్నర్ కు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ఇక జాన్వీ కపూర్ ఆ విధంగా కార్లో వెళ్తుండగా ఒక్కసారిగా మీడియా ఆమెను ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో జాన్వి తన మొహాన్ని దాచుకుంటూ కనిపించింది అందుకు సంబంధించిన విజువల్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X