ఎవరితోనైనా సెక్స్ కోరుకొంటే.. వెంటనే కానిచ్చేయండి, పిల్లల్ని ప్రోత్సహించాలి: కంగన
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, హీరోయిన్ కంగన రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 సదస్సులో పాల్గొన్న ఆమె వ్యక్తిగత, కెరీర్ విషయాలను వెల్లడించారు. తన మొదటి ప్రేమ, ముద్దు గురించి ఆసక్తికరంగా చర్చించడంతో ఆమె మీడియాలో ప్రముఖంగా నిలిచారు. ఇటీవల ఆమె నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించగా.. ఇటీవల వచ్చిన మణికర్ణిక బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పడించింది. ఇంతకు ఇండియా టుడే సదస్సులో కంగన ఏం చెప్పారంటే...

మీరు సెక్స్ కోరుకొంటే
ప్రతీ ఒక్కరి లైఫ్‌లో సెక్స్ అనేది చాలా కీలకం. మీరు సెక్స్ కోరుకొంటే.. ఎలాంటి మొహమాటం లేకుండా వెంటనే ఆ పని కానిచ్చేయండి. మనసులోనే కోరిక పెట్టుకొని దాని కోసం వేచి ఉండకండి. ఒకప్పుడు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోమంటే..మనం అతడిపైనే ఎమోషన్స్ పెంచుకోవడమనే విషయాలు ఇప్పుడు కనిపించడం లేదు. చరిత్రలోని దాడులు, అభిప్రాయాలు మన మీద బలవంతంగా రుద్దుతున్నారు. మన ఆచారాలు, సంప్రదాయాలు శృంగారాన్ని అనుమతించదు అని కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

పిల్లలు సెక్స్ కోరుకంటే
అంతేకాకుండా కంగన మరో అడుగు ముందు వేసి.. పిల్లలు శృంగారాన్ని కోరుకొంటే సంతోషంగా ఫీల్ అవ్వాలి. సెక్స్ పట్ల పిల్లలు బాధ్యతాయుతంగా ఉండాలి. నేను పెళ్లికి ముందే సెక్స్ విషయంలో యాక్టివ్‌గా ఉండటాన్ని చూసి నా తల్లిదండ్రులు షాక్ తిన్నారు. సెక్స్ విషయంలో పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి అని కంగన పేర్కొన్నారు.

మణికర్ణిక వివాదం
ఇటీవల క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ చిత్రంలో నటించారు. అయితే సినిమాకు తానే పూర్తిగా దర్శకత్వం బాధ్యతలు వహించానని, అయితే క్రిష్‌కు డైరెక్షన్ విషయంలో ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారాయి. అంతేకాకుండా క్రిష్‌పై పలు ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.

తలైవిగా కంగన రనౌత్
ప్రస్తుతం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి, దివంగత నేత జే జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న తలైవి అనే బయోపిక్‌లో కంగన నటిస్తున్నది. ప్రముఖ మాటల రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











