స్టార్ హీరోతో పడుకో.. ఆఫర్ ఇస్తాం.. సినీ ప్రముఖుల బండారం బయటపెట్టిన నటి
బాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ బండారం బట్టబయలైంది. టీవీ నటి కిశ్వర్ మర్చంట్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. దీంతో హిందీ చిత్ర పరిశ్రమలో పడకగదిలోకి వస్తే ఆఫర్ ఇస్తారనే సంఘటన మరోసారి చర్చనీయాంశమైంది. తనకు ఎదురైన అనుభవాన్ని మీడియాకు వెల్లడిస్తూ ఏదో సెన్సేషన్ కోసం చెప్పాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. ఇంతకు సంచలన ఆరోపణలు చేసిన కిశ్వర్ మర్చంట్ ఎవరు, ఆమె కెరీర్ ఎలా సాగిందంటే...
హాట్ జిమ్ డ్రెస్‌తో సెగలు రేపుతోన్న రకుల్ ప్రీత్ సింగ్

టీవీ నటి నుంచి సినీ నటిగా
కిశ్వర్ మర్చంట్ నటిగా ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నది. ఇటీవల బేజా ఫ్రై 2, హమ్ తుమ్ ఔర్ షబానా చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా పలు టీవీ సీరియల్స్ మంచి పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్నారు. శక్తిమాన్ సీరియల్‌తో కెరీర్ ఆరంభించిన కిశ్వర్.. ఎక్స్ జోన్, సీఐడీ, బాక్స్ క్రికెట్ లీగ్, కహా హమ్ కహా తుమ్ సీరియల్స్ నటించింది.

బాలీవుడ్ చిత్రం ఆడిషన్ కోసం
బాలీవుడ్ సినిమా ఆడిషన్ కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఆ క్రమంలో ఓ సినిమా ఆఫీస్‌కు నా తల్లితో కలిసి వెళ్లాను. మీకు సినిమాలో ఆఫర్ ఇస్తాను. కానీ ఓ స్టార్ హీరోతో పడుకోవాల్సి ఉంటుంది. ఆ వారు చెప్పిన మాటలు విని షాక్ అయ్యాను. వారి ఆఫర్ నిరాకరించి అక్కడి నుంచి వెళ్లిపోయాను అని కిశ్వర్ మర్చంట్ వెల్లడించారు.

సినీ ప్రముఖులతో పడుకోవడమనేది
ఆఫర్ కోసం హీరోతో పడుకోవడమనేది కొత్త కాదు. ఇండస్ట్రీలో ఇది గొప్ప నేరమని చెప్పలేను కానీ.. ప్రతీ ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఇలాంటి వ్యవహారాల్లో టాప్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఉన్నారు. అందుకే దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ అప్రతిష్ట కలుగుతున్నది. అయినా ఇలాంటి సంఘటనలు నా కెరీర్‌ను అడ్డుకోలేదు అని కిశ్వర్ మర్చంట్ పేర్కొన్నారు.

ఇలాంటి సంఘటనలతో బాధగా
జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు కొంత బాధగా కలుగుతుంది. చాలా నెర్వస్‌గా ఫీల్ అవుతాం. ఆఫర్ చేజారిపోతుందనే విషయంతో మిశ్రమ స్పందన గుండెలో ఉంటుంది. ఇలాంటివేమీ పట్టించుకోకుండా ముందుకు పోవడమే ప్రతీ ఒక్కరు చేయాల్సిన విషయం అంటూ కిశ్వర్ మర్చంట్ పేర్కొన్నారు.
Recommended Video

భర్తతో కలిసి బిగ్‌బాస్ 9లో
టీవీ నటుడు సూర్యాంశ్ రాయ్‌ని పెళ్లి చేసుకొన్న కిశ్వర్ మర్చంట్ త్వరలోనే తల్లి కాబోతున్నది. ఈ జంట గతంలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ 9లో పాల్గొన్నారు. ఇటీవల తాను గర్బవతిని అయ్యానంటూ తన అనుభవాలను పంచుకొన్నారు.


Click it and Unblock the Notifications











