ఆరు నెలలు నరకం అనుభవించా.. అదే పని.. చివరకు మద్యానికి బానిసయ్యా: నటి

కష్టసుఖాల సమ్మేళనమే జీవితం. సాధారణ ప్రజలు మొదలుకొని సెలెబ్రిటీల వరకూ అందరి జీవితాల్లోనూ కష్టసుఖాలు రావడం కామన్. జీవితంలో ఎప్పుడో ఒకసారి చెప్పుకోలేని కష్టాలు వస్తుంటాయి. అలాంటి కొన్ని కష్టాలు ఎదుర్కొని డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట బాలీవుడ్ నటి లారేన్ గోట్లీబ్. ఈ మేరకు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు బయటపెట్టింది ఈ నటీమణి. వివరాల్లోకి పోతే..

సమస్యలను బయటపెట్టిన నటీమణి

సమస్యలను బయటపెట్టిన నటీమణి

బాలీవుడ్ మూవీ ‘ఏబీసీడీ: ఎనీబడీ కెన్ డ్యాన్స్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి లారేన్ గోట్లీబ్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో ఆమె పేరు దేశమంతా తెలిసిపోయింది. ఈ సినిమా తర్వాత చాలా రోజుల పాటు మీడియాకు దూరంగా ఉన్న ఈమె.. ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూలో తన సమస్యలను వెల్లడించింది.

డిప్రెషన్‌తో బాధపడుతూ మద్యానికి బానిసయ్యా

డిప్రెషన్‌తో బాధపడుతూ మద్యానికి బానిసయ్యా

చాలా కాలంగా తాను డిప్రెషన్‌తో బాధపడుతున్నానని లారేన్ గోట్లీబ్ తెలిపింది. అందుకే మద్యానికి బానిసయ్యానని, తనకు డ్రగ్స్, మద్యంతోనే జీవితం సంతోషంగా గడిచిపోతోందని పేర్కొంది. అవే తన డిప్రెషన్‌కు మెడిసిన్‌లా పనిచేస్తున్నాయని చెప్పింది. రెండేళ్ల పాటు ఎంతో నరకం అనుభవించానని, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని వెల్లడించింది.

చాలా నిజాయతీగా ఉంటా.. కానీ వాళ్ళు మాత్రం

చాలా నిజాయతీగా ఉంటా.. కానీ వాళ్ళు మాత్రం

‘ఏబీసీడీ' సినిమాలో అవకాశం రావడం, అలాగే ఒక్కసారిగా ఫేం వచ్చేయడంతో దాని వలలో పడిపోయానని చెప్పుకొచ్చింది లారేన్ గోట్లీబ్. ఈ సినిమాతో తాను ఇండియానే నివాస కేంద్రంగా మార్చుకున్నానని తెలిపింది. ఇండియా నుంచి అమెరికాకు వెళుతున్నప్పుడు ఫ్లైట్‌లో ఎంతో ఏడ్చేదాన్నని చెప్పింది. తాను ఇతరులతో చాలా నిజాయతీగా ఉంటానని, కానీ అందరూ తనకు అబద్దాలు చెబుతారని అనేసింది లారేన్ గోట్లీబ్.

ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ అనే ట్యాగ్‌

ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ అనే ట్యాగ్‌

ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ అనే ట్యాగ్‌ను తనకు ఇచ్చేయడంతో.. ఫెయిల్ కాకూడదని చాలా కష్టపడ్డానని ఆమె తెలిపింది. ఏబీసీడీ సినిమాలో అమెరికన్ ఇండియన్ డ్యాన్సర్ పాత్రలో నటించాను కానీ తనను ప్రమోషన్స్‌కు పిలవక పోవడం, సినిమాలో తన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కూడా డిలీట్ చేయడం బాధపెట్టిందని చెప్పింది లారేన్ గోట్లీబ్.

Recommended Video

#CineBox : Fans Begin Countdown For RRR,With #250daystomassiveRRR
ఆరు నెలల పాటు నరకం

ఆరు నెలల పాటు నరకం

అలా ఆరు నెలల పాటు తీవ్ర నరకం అనుభవించానని లారేన్ గోట్లీబ్ తెలిపింది. ఇప్పుడిప్పుడే చీకటి నుంచి బయటపడుతున్నానని ఈ సందర్బంగా ఆమె తెలిపింది. త్వరలో బాలీవుడ్‌లో ఇంకొన్ని సినిమాలు చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X