డ్రగ్స్, అమ్మాయిలను సప్లై చేస్తాడు.. మహేష్ భట్‌పై టాలీవుడ్ హీరోయిన్ ఫైర్.. ఆర్జీవితో కలిసి

బాలీవుడ్‌ను డ్రగ్స్ రాకెట్ కేసు వివాదం ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఎన్సీబీ దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో కొత్తగా హీరో, హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ కుటుంబంపై ఓ హీరోయిన్ సంచలన ఆరోపణలు చేయడం హిందీ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా యువ హీరోయిన్ లువీనా లోధ్‌ చేసిన విషయాలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె తాజాగా సోషల్ మీడియాలో వీడియోను రిలీజ్ చేస్తూ మహేష్ భట్ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే...

 మహేష్ భట్ మేనల్లుడికి విడాకులు ఇచ్చా

మహేష్ భట్ మేనల్లుడికి విడాకులు ఇచ్చా

హీరోయిన్ లువీనా లోద్ విడుదల చేసిన రెండు నిమిషాల వీడియోలో మాట్లాడుతూ... నా పేరు లువీనా లోద్. నేను మహేష్ భట్ మేనల్లుడు సుమిత్ సభర్వాల్‌ను వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత ఆయన డ్రగ్స్, అమ్మాయిలను ప్రముఖులకు సప్లై చేస్తారనే విషయం తెలిసింది. దాంతో నేను సుమిత్‌కు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాను అని లువీనా లోద్ తెలిపారు.

 మహేష్ భట్ చాలా మందిని నాశనం చేశాడు

మహేష్ భట్ చాలా మందిని నాశనం చేశాడు

బాలీవుడ్‌లో మహేష్ భట్ చాలా దారుణమైన వ్యక్తి. ఎంతో మంది జీవితాలను నాశనం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా ఉంటే.. వారిని నాశనం చేసే వరకు వదలడు. ఎవరైనా తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలూ వాళ్ల ఆఫర్లు ఫినిష్ అవుతాయి. ఇప్పుడు నాపై కూడా కక్ష కట్టారు అని లువీనా లోద్ ఆరోపణలు చేసింది.

 నాకు ఏదైనా జరిగితే.. మహేష్ భట్ బాధ్యత

నాకు ఏదైనా జరిగితే.. మహేష్ భట్ బాధ్యత

కొన్ని నాళ్లుగా నా ఇంట్లోకి దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. నా ఇంట్లోకి చొరబడి నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో నేను ధైర్యాన్ని కూడగట్టుకొని పోలీస్ కేసు ఫైల్ చేశాను. కానీ ఆయనపై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. నాకు గానీ, నా ఫ్యామిలీకి గానీ ఏదైనా జరిగితే అందుకు బాధ్యత మహేష్ భట్ అని లువీనా లోద్ పేర్కొన్నారు.

లువీనాపై చర్యలు తీసుకొంటాం

లువీనాపై చర్యలు తీసుకొంటాం

హీరోయిన్ లువీనా లోధ్‌ చేసిన ఆరోపణలపై మహేష్ భట్ తరపు న్యాయవాది స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఓ నోటీసు జారీ చేశారు. లువీనా లోధ్ వీడియోలో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా ఆమెపై చర్యలు తీసుకొంటాం. మహేష్ భట్‌పై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆయన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉన్నందున ఆమె పరువునష్టం కేసు వేస్తాం. చట్టప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకొంటాం అని న్యాయవాది పేర్కొన్నారు.

Recommended Video

Rhea Chakraborty : Sushant ని నమ్మి నేను చాలా మోసపోయాను.. తన వంట వాడే డ్రగ్స్ రెడీ చేసేవాడు!
రాంగోపాల్ వర్మతో కలిసి

రాంగోపాల్ వర్మతో కలిసి

నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రష్మియా నటించిన కజ్రారారే చిత్రం ద్వారా లువీనా లోద్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. కొన్ని తెలుగు, కన్నడ సినిమాల్లో కూడా నటించారు. కన్నడ మూవీ నిర్దోష్‌లో కూడా కనిపించారు. జీ సినీ స్టార్స్ కి ఖోజ్ అనే టెలివిజన్ షోలో కూడా కనిపించారు. ఆ మధ్య రాంగోపాల్ వర్మ‌తో కలిసి హంగామా చేశారు. ఆర్జీవి తన చిత్రంలో లువీనాకు ఆఫర్ ఇస్తున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X