ప్రెగ్నెంట్‌గా షారుక్ ఖాన్ హీరోయిన్.. అసలు విషయం చెప్పేసిన బాలీవుడ్ హీరోయిన్!
బాలీవుడ్ నటి మహిరా ఖాన్ త్వరలో పండంటి బిడ్డను కనడానికి సిద్దంగా ఉన్నారనే వార్తలు ఇటీవల కాలంలో జోరుగా షికారు చేస్తున్నాయి. అయితే మీడియా వార్తలు ఓ పక్క వైరల్ అవుతున్నా మౌనం పాటిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ఓ సినిమాను తొలగించారనే వార్తపై స్పందిస్తూ అసలు విషయం బయపెట్టింది ఈ అందాల భామ. అయితే తన ప్రెగ్నెన్సీపై క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల వివరాల్లోకి వెళితే..
పాకిస్థాన్‌కు చెందిన మహిరా ఖాన్ ప్రముఖ పారిశ్రామిక వేత్త సలీం కరీంను ఇటీవల వివాహం చేసుకోవడం తెలిసిందే. అయితే ఈ జంట త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారనేది మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. అయితే వీరిద్దరూ కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మౌనంగా ఉంటూ వచ్చారు.

అయితే మహిరా ఖాన్‌ను నెట్‌ఫ్లిక్స్ రూపొందించే జో బచే సాంగ్ సమైత్ లో, అలాగే మరో ప్రాజెక్టు నుంచి తొలగించారనే వార్తలు వెంట వెంటనే వచ్చాయి. ప్రెగ్నెన్సీ కారణంగానే ఆమెను ఈ రెండు ప్రాజెక్టుల నుంచి తప్పించారు అనే కథనాలు ఊపందుకొన్నాయి. దాంతో ఈ వార్తపై క్లారిటీ ఇవ్వకపోతే మరింత ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఓ ప్రకటన చేశారు.
మీడియాతో మహీరా ఖాన్ మాట్లాడుతూ.. మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. వాటిలో ఏమాత్రం నిజం లేదు. నేను ప్రెగ్నెంట్ కాలేదు. అలాగే నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్టు నుంచి నేను వైదొలగలేదు. వారు నన్ను తీసి వేయలేదు కూడా అని చెప్పారు. తాను ప్రెగ్నెంట్ అనే వార్తలను ఇక రాయకండి అని సూచించారు.

మహిరా ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. షారుక్ ఖాన్ నటించిన రాయిస్ సినిమాతో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పాకిస్థాన్ సినిమాల్లో నటిస్తున్నది. అక్టోబర్ 1వ తేదీన ఆమె సలీం అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకొన్నది. తాజాగా ఆమె గర్బం దాల్చిందనే వార్తతో ఆమె క్లారిటీ ఇచ్చి అసలు విషయం చెప్పేసింది.


Click it and Unblock the Notifications











