India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Malaika Arora: రోడ్డు ప్రమాదానికి గురైన హీరోయిన్.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే!

  |

  మోడల్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టి.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ముదురు భామ మలైకా అరోరా. పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో పాటు చక్కని అభినయం కనబరిచినా ఎందుకనో సినిమాల్లో నిలదొక్కుకోలేకపోయింది. కానీ, అడపాదడపా బిగ్ స్క్రీన్‌పై ఏదోలా సందడి చేస్తూనే ఉంది. అలాగే, ఎన్నో షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

  ఇలా సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో సందడి చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మలైకా అరోరా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని వస్తుండగా ఆమెకు యాక్సిడెంట్ అయింది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు అయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ఘటన ఎలా జరిగింది? ఆమె పరిస్థితి ఎలా ఉంది? తెలుసుకుందాం పదండి!

   ఫ్యాషన్ షోలో పాల్గొన్న హీరోయిన్

  ఫ్యాషన్ షోలో పాల్గొన్న హీరోయిన్

  వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇప్పటికీ వరుస పెట్టి షోలు చేస్తూ మలైకా అరోరా ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో స్పెషల్ ఈవెంట్లలో కూడా పాల్గొంటూ తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే శనివారం ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటికి భారీ స్థాయిలో స్పందన కూడా దక్కుతోంది.

  Janhvi Kapoor: టైట్ డ్రెస్‌తో రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు.. వామ్మో మరీ ఇంత దారుణమా!

  రోడ్డు ప్రమాదానికి గురైన మలైకా

  రోడ్డు ప్రమాదానికి గురైన మలైకా

  ఫ్యాషన్ షోలో పాల్గొని తిరిగి వస్తుండగా మలైకా అరోరా ప్రయాణిస్తోన్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ముంబైలోని ఖలాపూర్ టోల్ ప్లాజా సమీపంలో రెండు కార్లు ఒకదానిని ఒకటి ఢీకొట్టుకుంటూ వచ్చి మలైకా ప్రమాణిస్తోన్న వాహనానికి బలంగా తాకాయని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆమెతో పాటు డ్రైవర్, ఓ బాడీ గార్డ్ ఉన్నారని తెలుస్తోంది.

  మలైకా అరోరాకు స్వల్ప గాయం

  మలైకా అరోరాకు స్వల్ప గాయం

  రోడ్డు ప్రమాదంలో మలైకా అరోరా ప్రయాణిస్తోన్న కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయిపోయింది. దీంతో ఆమెకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. గాయడిన మలైకాను వెంటనే ముంబైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మలైకా నుదిటిపై కంటి దగ్గర చిన్న గాయాలయ్యాయని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆమెకు సిటీ స్కాన్ పరీక్షలు నిర్వహించారు.

  Samantha: మరోసారి సమంత అందాల ఆరబోత.. వాళ్ల కోసం దిగిన పిక్‌లో దారుణంగా!

  మలైకా పరిస్థితి ఎలా ఉందంటే

  మలైకా పరిస్థితి ఎలా ఉందంటే

  కారు ప్రమాదంలో స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చేరిన మలైకా అరోరా ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆమెను రాత్రికి అబ్జర్వేషన్‌లో ఉంచుతామని వైద్యులు తెలిపారు. ఉదయాన్నే మరోసారి తగిన పరీక్షలు చేస్తామని వివరించారు. అన్నీ బాగానే ఉంటే ఆదివారమే మలైకాను డిశ్చార్జ్ చేస్తామని కూడా మీడియాకు చెప్పారు.

  ఫ్యాన్స్ ఆందోళన.. కోలుకోవాలని

  ఫ్యాన్స్ ఆందోళన.. కోలుకోవాలని

  మలైకా అరోరా ముంబై సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైందన్న వార్త తెలిసిన వెంటనే ఆమె అభిమానులు కంగారు పడ్డారు. అయితే, ఆమెకు చిన్న గాయాలే తగలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, మలైకా త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె కోసం పోస్టులు చేస్తున్నారు.

  స్టార్ హీరోతో ఒకే రూంలో దిశా పటానీ రచ్చ: ఫొటో షేర్ చేయడంతో బుక్కైన సినీ జంట

  తెలుగులోనూ అలరించిన మలైకా

  తెలుగులోనూ అలరించిన మలైకా

  మోడలింగ్ రంగంలో సత్తా చాటిన మలైకా అరోరా కొన్ని సినిమాల్లో నటించింది. కానీ, అంతగా పేరు రాలేదు. ఈ పరిస్థితుల్లో 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌' వంటి ఐటెం సాంగ్స్‌‌ చేసి గుర్తింపు పొందింది. అలాగే, తెలుగులో మహేశ్ బాబు 'అతిథి', పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్‌' చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్‌లోనూ కనిపించింది.

  స్టార్ హీరోతో లవ్ ట్రాక్ నడుపుతూ

  స్టార్ హీరోతో లవ్ ట్రాక్ నడుపుతూ

  అర్భాజ్‌ ఖాన్‌ను వివాహం చేసుకున్న మలైకా అరోరా.. కొన్నేళ్లకు విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఈ భామ బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది. మొదట్లో సీక్రెట్‌తో వ్యవహారం నడిపించి.. ఆ తర్వాత ఈ జంట మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లలో రచ్చ చేయడం.. హాలీడే ట్రిప్పుల ఇలా తెగ ఎంజాయ్ చేస్తోంది.

  English summary
  Bollywood Actress Malaika Arora met With Car Accident. She was hospitalized with minor Injuries at Apollo hospital in Navi Mumbai.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X