‘ఆ టైమ్‌లో నీ హాట్ ఫొటోలు తీస్తా’ అని గొడవ చేస్తున్నాడు: మలైకా అరోరా ఫిర్యాదు
వాళ్లిద్దరూ సినీ పరిశ్రమకు చెందిన వారే. చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారు. అంతేకాదు, ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోకుండానే ఒక ఇంట్లో కాపురం పెట్టేశారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత మరింతగా రెచ్చిపోతున్నారు. తరచూ డిన్నర్ డేట్‌కు వెళ్లడం.. బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇవ్వడం.. కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. వాళ్లే బాలీవుడ్ ప్రేమ పక్షులు నటి మలైకా అరోరా.. స్టార్ హీరో అర్జున్ కపూర్. ఇప్పటికే ఎన్నో సార్లు వార్తల్లో నిలిచిన ఈ జంట.. తాజాగా మరోసారి హైలైట్ అవుతోంది. దీనికి కారణం మలైకా చేసిన కామెంట్లే.!

మహేశ్ బాబు, పవన్‌తో రొమాన్స్ చేసింది
మలైకా అరోరా మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంటర్ అయింది. కొన్ని చిత్రాల్లో మాత్రమే చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ బ్యూటీ.. చాలా సినిమాలకు స్పెషల్ సాంగ్స్ చేసింది. ‘ఛయ్య ఛయ్య..', ‘అనార్కలీ డిస్కో ఛాలీ..', ‘మున్నీ బద్నామ్ హుయే' వంటి హిందీ పాటలకు తోడు ‘అతిథి'తో మహేశ్ బాబుతో, ‘గబ్బర్ సింగ్'లో పవన్‌తో స్పెషల్ సాంగ్స్ చేసింది.

స్టార్ హీరో సోదరుడితో పెళ్లి.. విడాకులు
హిందీ, తెలుగుతో పాటు మరికొన్ని ఇండస్ట్రీల్లో స్పెషల్ సాంగ్స్ సహా సినిమాల్లో ఆఫర్లు వస్తున్న సమయంలోనే మలైకా అరోరా.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. 2017లో వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులిచ్చింది మలైకా.

12 ఏళ్లు చిన్నవాడైన స్టార్ హీరోతో ఎఫైర్
భర్తతో విడిపోయిన కొద్ది రోజులకే స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో మలైకా అరోరా ఎఫైర్ పెట్టుకుంది. బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడైన అర్జున్.. ఆమె కంటే 12 ఏళ్లు చిన్నవాడు. అయినప్పటికీ వీళ్లిద్దరూ అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. అయితే, పెళ్లి మాట ఎత్తితే మాత్రం.. ‘నాకు వివాహ బంధం మీద విరక్తి వచ్చింది. మళ్లీ పెళ్లి చేసుకోని బాధ పడలేను' అని చెబుతోందామె.

ముద్దులతో రచ్చ.. నావాడే అంటూ క్లారిటీ
కొద్ది రోజుల క్రితం ‘కాఫీ విత్ కరణ్' షోలో అర్జున్ కపూర్.. మలైకా అరోరాతో బంధం గురించి బయట పెట్టాడు. అలాగే ఆమె కూడా ఇటీవల అతడి ఫొటోను షేర్ చేస్తూ ‘అర్జున్ నావాడు' అని పోస్ట్ చేసింది. ఇక, గత ప్రేమికుల రోజున అయితే ఇద్దరూ కలిసి ముద్దులు పెట్టుకుంటున్న ఫొటోలను పోస్ట్ చేశారు. దీంతో ఈ జంట దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

ఎప్పుడూ అక్కడే.. డేటింగ్.. బోల్డ్ స్టేట్‌మెంట్
పెళ్లి చేసుకోకుండానే వీళ్లిద్దరూ కలిసి ముంబైలో ఓ ఇంట్లో కాపురం పెట్టేశారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత నుంచి తరచూ డిన్నర్ డేట్లకు వెళ్తున్నారు. అదే సమయంలో ఒకరి గురించి ఒకరు బోల్డుగా చెప్పుకుంటూ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సార్లు తమ బంధం గురించి బహిరంగంగానే స్టేట్‌మెంట్లు ఇచ్చారు. దీంతో వీళ్లు తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు.
Recommended Video

‘ఆ టైమ్‌లో నీ హాట్ ఫొటోలు తీస్తా' అని గొడవ
తాజాగా సోషల్ మీడియాలో జరిగిన లైవ్ చాట్‌లో మలైకా అరోరా.. అర్జున్ కపూర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నేను దిగిన ఫొటోలు గానీ, వేరే ఎవరైనా తీసినవి కానీ అర్జున్‌కు నచ్చవు. తనకంటే నన్ను అందంగా ఎవరూ చూపించరని అంటుంటాడు. అందుకే సాయంత్రం వేళలో నా ఫొటోలు తీస్తా అని తరచూ గొడవ చేస్తుంటాడు' అని ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











