బతికి ఉండగానే ప్రాణాలు తీశారు... హీరోయిన్ మరణవార్తపై ఫ్యామిలీ షాక్.. ఏం జరిగిందంటే

మీడియా ప్రభావం పెరగడం, సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో వార్తల మీద కంట్రోల్ లేకుండా పోయింది. గతంలో అవాస్తవ వార్తలు మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా అలనాటి హీరోయిన్ ముంతాజ్ మరణించారనే వార్తలు శుక్రవారం రాత్రి నుంచి పలు మీడియాలో వార్తలు పోటెత్తాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని సినీ వర్గాలు స్పందించాయి. తాజాగా దర్శకుడు మిలప్ జవేరి సోషల్ మీడియాలో ముంతాజ్ మరణించలేదని వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

మరణ వార్తను ఆపేయండి

మరణ వార్తను ఆపేయండి

సీనియర్ హీరోయిన్ ముంతాజ్ బతికే ఉంది. ఆమె మరణ వార్తలు చూసి షాక్ అయ్యాం. తాను బతికే ఉన్నట్టు మీడియాకు వెల్లడించమని చెప్పింది. నా మరణ వార్తలను ఆపేయాలని ముంతాజ్‌తోపాటు ఆమె కుటుంబ సభ్యులు, హీరో షాద్ రాంధ్వా కూడా కోరారు అని దర్శకుడు మిలాప్ జవేరి తెలిపారు.

 ఫ్యామిలీ షాక్ తిన్నారు..

ఫ్యామిలీ షాక్ తిన్నారు..

ముంతాజ్ ఆంటీ ఆరోగ్యంతో చక్కగా ఉన్నారు. ముంతాజ్‌తోపాటు ఆమె మేనల్లుడు, సినీ నటుడు షాద్ రాంధ్వాతో మాట్లాడాను. తాను చనిపోయినట్టు వచ్చిన వార్తలను చూసి ఆమె బాధపడ్డారు. వెంటనే మీడియాకు అసలు విషయం తెలిపి వార్తలను ఆపేయాలని కోరారు అని దర్శకుడు మిలాప్ జవేరి వెల్లడించారు.

గుండెపోటు మరణించారని ట్వీట్

గుండెపోటు మరణించారని ట్వీట్

ప్రముఖ ట్రేడ్ అనలిస్టు కోమల్ నహతా ట్వీట్‌తో ఈ గందరగోళం నెలకొన్నది. అలనాటి నటి ముంతాజ్ ఇకలేరు. శుక్రవారం ఉదయమే ముంబైలో గుండెపోటుతో ఆమె నిద్రలోనే మరణించారు. అమెరికా నుంచి ఆమె కూతురు రాగానే అంత్యక్రియలు జరుగుతాయి అని కోమల్ నహతా ట్వీట్ చేయడంతో ఆమె మరణ వార్త వైరల్‌గా మారింది.

క్షమాపణ చెప్పిన సినీ ప్రముఖుడు

క్షమాపణ చెప్పిన సినీ ప్రముఖుడు

తన ట్వీట్ మీడియాలో వైరల్ కావడం, గందరగోళం సృష్టించడంతో కోమల్ నహతా తన తప్పు తెలుసుకొన్నాడు. ముంతాజ్ జీ మరణించినట్టు తాను చేసిన ట్వీట్‌ వాస్తవం కాదు. భగవంతుడి దయవల్ల ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. ఆమె మరణ వార్త అసత్యం. కొందరు తప్పుడు సమాచారం ఇవ్వడంతో సినీ వర్గాల్లో గందరగోళం నెలకొన్నది. నా తరపు నుంచి క్షమాపణలు కోరుతున్నాను అని కోమల్ నహత్ వివరణ ఇచ్చారు.

 బాలీవుడ్ తెరపై ముంతాజ్ ప్రతిభ

బాలీవుడ్ తెరపై ముంతాజ్ ప్రతిభ

బాలీవుడ్ తెరపై ముంతాజ్ ప్రతిభకు ఫిదా కానివరెవరూ ఉండరేమో. 60, 70 దశకాల్లో ఆమె సినీ రంగాన్ని ఓ ఊపు ఊపేశారు. ఆ తర్వాత నటనకు గుడ్‌బై చెప్పి కుటుంబానికే పరిమితమయ్యారు. చాలా కాలం తర్వాత మళ్లీ బాలీవుడ్ తెరపై కనిపించబోతున్నారు. మిలాప్ జవేరి రూపొందించిన మార్జవాన్ చిత్రంలో ఆమె నటించారు. ఈ చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రా, రితేష్ దేశ్‌ముఖ్, రకుల్ ప్రీత్ సింగ్, తారా సుతారియా నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X