twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Nora Fatehi మెడకు 215 కోట్ల కుంభకోణం కేసు.. 4 గంటలపాటు ఢిల్లీ పోలీసుల విచారణ

    |

    బలవంతపు వసూళ్లకు పాల్పడిన సుకేష్ చంద్రశేఖర్ కేసులో బాలీవుడ్ హీరోయన్ నోరా ఫతేహికి చేదు అనుభవం ఎదురైంది. అక్రమ ఆర్థిక లావాదేవీల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ బాలీవుడ్ ముద్దు గుమ్మను ఢిల్లీ పోలీసులు శుక్రవారం నాలుగు గంటలపాటు విచారించారు. సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించి 200 కోట్ల బలవంతపు వసూళ్ల కుంభకోణంలో ఢిల్లీకి చెందిన ఆర్థిక నేరాల విభాగానికి చెందిన అధికారులు నోరా ఫతేహిని పలు రకాలుగా విచారించారు. ఈ కేసు విచారణ వివరాల్లోకి వెళితే..

    215 కోట్ల రూపాయల కుంభకోణంలో

    215 కోట్ల రూపాయల కుంభకోణంలో

    తమిళనాడుకు చెందిన సుకేష్ చంద్రశేఖర్ ప్రముఖ ఫార్మ కంపెనీ రాన్ బాక్సీ ప్రమోటర్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారు. రాన్ బాక్సీకి చెందిన అదితి సింగ్, శివేందర్ సింగ్ నుంచి 215 కోట్ల రూపాయాలను బలవంతంగా వసూలు చేశాడనే ఆరోపణలపై సుకేష్ జైలు శిక్షను తీహార్ జైలులో అనుభవిస్తున్నాడు. అయితే తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తూనే.. హోంమంత్రి అమిత్ షా పీఏను అంటూ ఫోన్‌లో బెదిరించాడు. అంతేకాకుండా సినీ తారలతో ఫోన్లలో కూడా మాట్లాడటం సంచలనం రేపింది.

    నోరా ఫతేహికి బీఎండబ్ల్యూ కారు

    నోరా ఫతేహికి బీఎండబ్ల్యూ కారు

    సుకేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ వ్యవహారాలను దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు దృష్టిలో బాలీవుడ్ తార నోరా ఫతేహి పడ్డారు. ఆమెకు భారీ మొత్తంలో విలాసవంతమైన వస్తువులు, బీఎండబ్ల్యూ కారును నోరా ఫతేహికి ఇచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది. అయితే తనకు సుకేష్‌తో ఎలాంటి సంబంధాలు లేవని ఆమె స్పష్టం చేసింది. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది.

    ఈవెంట్‌లో చీఫ్ గెస్టుగా

    ఈవెంట్‌లో చీఫ్ గెస్టుగా

    తనకు సుకేష్ చంద్రశేఖర్‌ ఎలాంటి ఖరీదైన వస్తువులు ఇవ్వలేదు. నేను ఆయనకు సంబంధించిన వాళ్లు నిర్వహించిన ఓ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా వెళ్లాను. ఆ సమయంలో పబ్లిక్‌గా నాకు ఖరీదైన గుచ్చి బ్యాగ్, ఐఫోన్ 12ను బహుకరించాడు. అంతేగానీ నాకు ఆయనతో ఎలాంటి ఆర్థిక వ్యవహారాలు లేవు అని ఆమె స్పష్టం చేసింది.

    ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా

    ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా

    అయితే తనకు బీఎండబ్లూ బహుకరించాలని సుకేష్ అనుకొన్నాడు. అయితే నాకు ఖరీదైన, విలాసవంతమైన కారు అక్కర్లేదు అని చెప్పాను. కానీ నా ఫ్యామీలి ఫ్రెండ్ బాబీ ద్వారా ఈ సుకేష్ సంప్రదింపులు జరిపాడు. ఆ తర్వాత నాకు కారును బహుకరించాడు. ఈ వ్యవహారంలో నా ఫ్యామిలీ ఫ్రెండ్‌కు ఎలాంటి సంబంధం లేదు అని నోరా ఫతేహి స్పష్టం చేసింది.

    మనీలాండరింగ్ కేసులో

    మనీలాండరింగ్ కేసులో

    ఇలాంటి ఆరోపణల మధ్య నోరా ఫతేహిని మనీలాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద ఆమెను రెండుసార్లు విచారించారు. 2020లో ఒకసారి, 2021లో మరోసారి ప్రశ్నించారు. తాజాగా మరోసారి ఢిల్లీ పోలీసులు విచారించడంతో నోరా ఫతేహి మెడకు ఈ కేసు చుట్టుకొంటుందా అనే అనుమానాలు బాలీవుడ్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

    జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఆరోపణలతో

    జాక్వలైన్ ఫెర్నాండేజ్ ఆరోపణలతో

    ఇదిలా ఉండగా సుకేష్ చంద్రశేఖర్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ పేరును చార్జిషీట్‌లో చేర్చడం సంచలనం రేపింది. అయితే తనను ఈ కేసులో బలి పశువును చేశారు. సుకేష్ నుంచి ముడుపులు తీసుకొన్న నోరా ఫతేహి, ఇతర హీరోయిన్ల మాటేమిటి? అని జాక్వలైన్ ప్రశ్నించింది. ఈ క్రమంలో నోరా ఫతేహిని కూడా విచారించడం చర్చకు దారి తీసింది.

    English summary
    Bollywood Actress Nora Fatehi questioned in ₹200 crore extortion case by Delhi Police linked to Sukesh Chandrashekhar case. She denied the allegations which are coming in Money laundering case.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X