Parineeti Chopra: ప్రియుడితో స్టార్ హీరోయిన్ పెళ్లి.. భర్తతో రొమాంటిక్‌‌గా.. ఫొటోలు వైరల్

ప్రియాంక చోప్రా సోదరిగా సినీ రంగంలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ పరిణితి చోప్రా. సుదీర్ఘమైన ప్రయాణంలో ఎన్నో చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె.. తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకు వెళ్తోంది.

ఈ క్రమంలోనే ఇప్పుడు తన ప్రియుడు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో మధుర ఘట్టమైన వివాహాన్ని చేసుకుంది. ఈ నేపథ్యంలో పరిణితీ చోప్రా పెళ్లి ఎలా జరిగింది? వివాహం తర్వాత ఆమె ఏం చెప్పింది? అనే వివరాలు చూద్దాం పదండి!

Actress Parineeti Chopra Married AAP MP Raghav Chadha.. First Photos Goes Viral

ప్రియుడితో పరిణితి వివాహం: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా తాజాగా పెళ్లి చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ఆమె ఏడు అడుగులు నడించింది. సెప్టెంబరు 24 రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి సుమారు 200 మందికి పైగా అతిథులు పాల్గొన్నారు. 50 మందికిపైగా వీఐపీలు పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు.

Actress Parineeti Chopra Married AAP MP Raghav Chadha.. First Photos Goes Viral

జంటకు శుభాకాంక్షల వెల్లువ: పరిణితి - రాఘవ్ పెళ్లికి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కెజ్రీవాల్ కూడా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అలాగే, సానియా మీర్జా, క్రికెటర్ హర్బజన్ సింగ్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, శివసేన నేత ఆదిత్య థాక్రే తదితర ప్రముఖులు విచ్చేశారు. ఇక, వివాహానికి హాజరు కాని ఎంతో మంది ప్రముఖులు సైతం సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్తున్నారు.

Actress Parineeti Chopra Married AAP MP Raghav Chadha.. First Photos Goes Viral

ఆరోజునే ఓ రేంజ్‌లో రిషెప్షన్: పరిణితి చోప్రా, రాఘవ్ చద్దా వివాహం ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొంత మంది ప్రముఖుల సమక్షంలోనే జరిగింది. అయితే, వీళ్లిద్దరి రిషెప్షన్‌ను మాత్రం భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీన్ని సెప్టెంబర్ 30వ తేదీన చండీగర్‌లో జరపబోతున్నారు. దీనికి సినీ, రాజకీయ నాయకులను అత్యధిక సంఖ్యలో ఆహ్వానించబోతున్నారు.

Actress Parineeti Chopra Married AAP MP Raghav Chadha.. First Photos Goes Viral

ఫొటోలు వైరల్.. రొమాంటిక్‌గా: పరిణితి చోప్రా, రాఘవ్ చద్దా వివాహానికి మీడియాను అనుమతించలేదు. దీంతో వీళ్లిద్దరి పెళ్లి ఎలా జరిగింది అన్న వివరాలు, ఫొటోలు, వీడియోలు ఏమీ బయటకు రాలేదు. దీనిపై ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అటు పరిణితి చోప్రా, ఇటు రాఘవ్ చద్దా తమ సోషల్ మీడియా ఖాతాల్లో పెళ్లి ఫొటోలను షేర్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

Actress Parineeti Chopra Married AAP MP Raghav Chadha.. First Photos Goes Viral

పరిణితి చోప్రా ఏమందంటే: ఇష్టమైన వాడితో వివాహం జరిగిన తర్వాత పరిణితి చోప్రా ఫొటోలను షేర్ చేసింది. అందులో 'మేము మొదటి సారి బ్రేక్‌ఫాస్ట్ కోసం కలిసి కూర్చున్నప్పుడే మా హృదయాలు కలిశాయి. ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను. ఎట్టకేలకు అందరి ఆశీర్వాదంతో మేము ఒక్కటయ్యాం. మేము ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేము' అంటూ తన సంతోషాన్ని పంచుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X