ఇక్కడ ఎవరు రేప్ చేయడం లేదు.. పాయల్‌ ఘోష్‌కి ఎదురుదెబ్బ, ఆ తప్పు కొంప ముంచేలా ఉంది

సినిమా ఇండస్ట్రీలో మీటూ ఆరోపణలు కొత్తేమి కాదు. కానీ దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని కొత్త తరహా కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ఎంత మందికి శిక్ష పడింది అనే ప్రశ్న ఎక్కువగా వైరల్ అవుతోంది. ఇక రీసెంట్ గా పాయల్ ఘోష్ చేసిన లైంగిక ఆరోపణలు కూడా ఊహించని విధంగా రివర్స్ అవుతున్నాయి. గతంలో ఆమె మీటూ ఉద్యమంపై వేసిన ఒక సెటైర్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

 అనురాగ్ కశ్యప్ కి పెరుగుతున్న మద్దతు

అనురాగ్ కశ్యప్ కి పెరుగుతున్న మద్దతు


ఒక వ్యక్తిని సాక్ష్యాలు లేనిదే ఎలా నిందిస్తారు అనేది రోజురోజుకి హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక పాయల్ ఘోష్ కి కౌంటర్ ఇచ్చేలా అనురాగ్ కశ్యప్ కి మద్దతు పలుకుతున్నారు మరికొందరు సెలబ్రెటీలు. అందులో హీరోయిన్స్ ఉండడం కూడా విశేషమే. ఇక అనురాగ్ కశ్యప్ మొదటి భార్యతో పాటు రెండవ భార్య కూడా అతనికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

 రామ్ గోపాల్ వర్మ నుంచి తాప్సి వరకు

రామ్ గోపాల్ వర్మ నుంచి తాప్సి వరకు


రామ్ గోపాల్ వర్మ నుంచి తాప్సి వరకు ప్రముఖ సెలబ్రెటీలు అనురాగ్ చెడ్డవాడు కాదని మహిళల పట్ల అతనికి ఒక మంచి అభిప్రాయం ఉందని సపోర్ట్ చేస్తున్నారు. ఇక పాయల్ ఘోష్ కి ఇంతవరకు కంగనా రనౌత్ తప్పితే ఇతర సినీ ప్రముఖులెవరు కూడా మద్దతు ఇవ్వకపోవడం గమనార్హం. గతంలో చాలా మంది హీరోయిన్స్ మీటూ ఆరోపణలు చేయగా వారికి తోటి నటీనటుల నుంచి ఎంతో కొంత సపోర్ట్ లభించింది.

ఎవరు కూడా అత్యాచారం చేయరు.

ఎవరు కూడా అత్యాచారం చేయరు.

ఇక పాయల్ ఘోష్ చేసిన వ్యాఖ్యలకు బాలీవుడ్ నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. ఇక ఇలాంటి సమయంలో ఆమె పోరాటాన్ని దెబ్బ కొట్టేలా మరొక ట్వీట్ వైరల్ గా మారింది. ఆమె గతంలో చేసుకున్న ఒక ట్వీట్ ఇప్పుడు కొంప ముంచేలా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక్కడ ఎవరు కూడా అత్యాచారం చేయరు. మీరు కంఫర్ట్ గా లేకపోతేనే ఇతరులు అవకాశం తీసుకుంటారు. ఈ విషయంలో సింపుల్ గా దూరంగా ఉండడమే మంచిది. ఇంత డ్రామా చేయవలసిన అవసరం లేదు.. అని పాయల్ 2018లో ఒక ట్వీట్ చేసింది.

Recommended Video

Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram Trailer
పాయల్ ఆరోపణలకు వాల్యూ లేకుండా పోతోందా..?

పాయల్ ఆరోపణలకు వాల్యూ లేకుండా పోతోందా..?

మీటూ ఉద్యమం వేడెక్కుతున్న సందర్భంలో పాయల్ అలా వ్యాఖ్యానించడం అప్పట్లో ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇపుడు మాత్రం ఆ ట్వీట్ తో అనేక రకాల మీమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇక అనురాగ్ కశ్యప్ కి కూడా మద్దతు లభిస్తోంది. పాయల్ లైంగిక ఆరోపణలు చేసిన తరువాత ఈ విషయాన్ని ఏ మాత్రం వదిలిపెట్టనని తెలిపింది. కానీ ఇప్పుడు ఆమె కామెంట్స్ కి వాల్యూ లేకుండా పోతోందనే కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో పాయల్ ఏం చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X