హీరోయిన్ పూనమ్ పాండే అరెస్ట్.. బాయ్‌ఫ్రెండ్‌తో రెడ్ హ్యాండెడ్‌గా..!
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండేకు చేదు అనుభవం ఎదురైంది. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ముంబై పోలీసులు ఆమెపై కరొడా ఝులిపించారు. రూల్స్‌కు వ్యతిరేకంగా బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కడంతో కేసు నమోదు చేశారు. ముంబైలో కరోనావైరస్ వ్యాప్తి రోజు రోజుకు దిగజారుతుండటంతో పోలీసులు కఠినంగా వ్యవహరించడం తెలిసిందే. ఈ క్రమంలోనే పూనమ్ పాండే అరెస్ట్ బాలీవుడ్ సినీ వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ చర్చకు దారి తీసింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

కారణం లేకుండా బాయ్‌ఫ్రెండ్‌తో
దేశవ్యాప్తంగా కరోనావైరస్ వ్యాప్తిని అరికొట్టేందుకు లాక్‌డౌన్ మే 17వ తేదీ వరకు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కారణం లేకుండా బాయ్ ఫ్రెండ్ సామ్ ఆహ్మద్‌తో రోడ్లపై తిరగడం ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీసుల దృష్టికి వచ్చింది. వారి ఇద్దరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా బయటకు రావడానికి ఎలాంటి కనిపించలేదు. దాంతో వారిపై కఠినంగా వ్యవహరించారు.

నిర్లక్ష్యపూరితంగా పూనమ్ పాండే
పూనమ్ పాండే, ఆమె ప్రియుడు సామ్ ఆహ్మద్ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించారనే విషయంతో ముంబై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయట పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారా? అంటూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. వారు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారును సీజ్ చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 188, 269, 51 బీ ప్రకారం కేసు నమోదు చేశారు.

పూనమ్ పాండే అరెస్ట్
అంతేకాకుండా లాక్‌డౌన్ నిబంధనలను బేఖాతరు చేసినందుకు గానూ పూనమ్ పాండేను ముంబై పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు పంపించారు. పూనమ్ అరెస్ట్ వార్త ముంబై సినీ వర్గాలను కుదిపేసింది. అంతేకాకుండా అకారణంగా బయట తిరిగే వారికి ఈ సంఘటన అప్రమత్తం చేసింది. మహారాష్ట్రలో రోజుకు వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పూనమ్ పాండే అరెస్ట్ నిజమే
హీరోయిన్ పూనమ్ పాండే అరెస్ట్‌పై ముంబై పోలీసులు స్పందిస్తూ.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. అలాగే పూనమ్, బాయ్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకొన్నాం. అంతేకాకుండా వారిద్దరిని నేషనల్ డిజాస్టర్ యాక్ట్ కింద అరెస్ట్ చేశాం అని సీనియర్ పోలీసు అధికారి మృత్యుంజయ్ హైరామత్ తెలిపారు.
Recommended Video

పూనమ్ పాండే కెరీర్
పూనమ్ పాండే నషా అనే చిత్రం ద్వారా శృంగారతారగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత కన్నడ, తెలుగు సినిమాల్లో నటించారు. ఆమె నటించిన చిత్రాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో పెద్దగా అవకాశాలు ఇంటి తలుపు తట్టలేదు. 2018లో గోవిందాతో ఆ గయా హీరో, అలాగే శక్తికపూర్‌తో కలిసి ది జర్నీ ఆఫ్ కర్మ అనే సినిమాలో నటించారు.


Click it and Unblock the Notifications











