Poonam Pandey Death: సినీ రంగంలో తీవ్ర విషాదం.. మాలిని అండో కో హీరోయిన్ మృతి?
ఇండియన్ సినిమాలో చాలా తక్కువ మంది భామలు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని నేషనల్ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో పూనమ్ పాండే ఒకరు. మోడలింగ్ చేస్తున్నప్పుడే సెన్సేషన్ అయిన ఈ భామ.. ఆ తర్వాత తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఫలితంగా తక్కువ వయసులోనే ఎంతో ఎత్తుకు సైతం చేరుకుంది. ఇక, ఈ మధ్య కాలంలో వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అలా అంతా సాఫీగా సాగుతున్నప్పుడే పూనమ్ మరణించినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ సంచలనంగా మారింది.
సెన్సేషనల్ హీరోయిన్ పూనమ్ పాండే మరణించినట్లు తాజాగా ఆమె అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ ప్రత్యక్షం అయింది. అందులో 'ఈ ఉదయం మాకు చాలా కష్టమైనది. మా ప్రియమైన పూనమ్ సర్వైకల్ (గర్భాశయ) క్యాన్సర్‌తో మరణించారు. ఈ విషయాన్ని మీకు తెలియజేసేందుకు చాలా బాధపడుతున్నాము. ఆమె తనతో పరిచయం ఉన్న ప్రతి జీవికి స్వచ్ఛమైన ప్రేమను పంచేందుకు ప్రయత్నించింది. ఈ దుఖ: సమయంలో మాకు అందరూ అండగా నిలవాలని, సహకరించాలని కోరుకుంటున్నాము' అని రాసుకొచ్చారు.

పూనమ్ పాండే సోషల్ మీడియా ఖాతాలోనే ఆమె మరణించినట్లు ప్రకటించడంతో ఇప్పుడిది దేశ వ్యాప్తంగా సెన్సేషన్‌గా మారిపోయింది. ఆమెకు ప్రస్తుతం 32 సంవత్సరాలే. తాజా పోస్టు ప్రకారం.. ఈ హీరోయిన్ గర్భాశయ క్యాన్సర్ కారణంగా మృతి చెందినట్లు తెలిసింది. పూనమ్ నిజంగానే కన్నుమూసిందా? లేక ఏదైనా ప్రచారంలో భాగంగా ఇలా పోస్ట్ చేశారా? ఇంతకీ పూనమ్ ఇప్పుడు ఎక్కడ ఉంది? అనే విషయాలు సస్పెన్స్‌గా మారాయి. ఒకవేళ ఇదే నిజం అయితే.. ఈ దుర్ఘటనపై పూర్తి సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. చాలా కాలం క్రితమే మోడల్‌గా పరిచయమైన పూనమ్ పాండే.. 2011 ప్రపంచకప్ సమయంలో టీమిండియా విజేతగా నిలిస్తే న్యూడ్‌గా ఫోజులిస్తానంటూ సంచలనం అయిపోయింది. ఆ దెబ్బతోనే అమ్మడు బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత న్యూడ్ షో చేయలేదు కానీ, క్రేజ్‌ను మాత్రం బాగా పెంచుకుంది. ఈ క్రమంలోనే 'నషా' అనే సినిమాతో ఎంటరైంది. ఆ తర్వాత తెలుగులోనూ 'మాలినీ అండ్ కో' చేసింది. ఇక, 'లాకప్' రియాలిటీ షో తర్వాత పూనమ్ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది.


Click it and Unblock the Notifications











