వరుసగా 20 సార్లు కోవిడ్ టెస్ట్ చేయించుకున్న సీనియర్ హీరోయిన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం దుబాయ్‌లో ఉన్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా, బయో బబుల్‌లో నివసించిన తన అనుభవాన్ని పంచుకుంది. ఇక 20వ సారి కరోనావైరస్ టేస్ట్ చేయించుకోవడంతో తనను తాను 'కోవిడ్ టెస్ట్ క్వీన్' అని పిలిచుకుంటోంది. ప్రీతి ఒక వీడియోను కూడా షేర్ చేసుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఆమె ముక్కు నుంచి శాంపిల్స్ తీసుకోగా ఈ విధంగా వివరణ ఇచ్చింది. 'ఇది నా 20వ కోవిడ్-19 పరీక్ష అని నేను అనుకుంటున్నాను. నేను కోవిడ్ టెస్ట్ క్వీన్ అయ్యాను' అంటూ సరదాగా నవ్వుతూ చెప్పింది. ఇక వీర్ జారా స్టార్ బయో బబుల్ లోపల జీవించడం ఎలా ఉంటుందో కూడా వివరించారు. జోవిడ్-19 యొక్క ఈ భయంకరమైన సమయాల్లో ఐపిఎల్ ఆటగాళ్ళు, ఫ్రాంచైజ్ సిబ్బంది మరియు సిబ్బందికి భద్రత కల్పించడానికి బయో బబుల్ సురక్షితమైన వాతావరణంగా మారింది.

బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు. ఇక ప్రీతి వీడియోపై ప్రముఖ ఫిట్‌నెస్ ట్రైనర్ డీన్నే పాండేను చాలా డిఫరెంట్ గా కామెంట్ చేసింది. అది సరైన మార్గంలో చేయలేదని అన్నారు. మరికొందరు ఆమె జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. ఇక క్రికెట్ ని అమితంగా ఇష్టపడే ప్రీతి జింటా ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సహా యజమనిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఆమె టీమ్ ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో 6వ స్థానంలో ఉంది. వరుసగా మిగతా నాలుగు మ్యాచ్ లు గెలిస్తే గాని కప్పు గెలిచే అవకాశం లేదు. గత మూడు మ్యాచ్ లకు రెగ్యులర్ గా స్టేడియంకి వస్తున్న ఆమె వరుస విజయాలు రావడంతో స్టేడియంలోనే సెలబ్రేషన్స్ చేసుకుంటోంది.


Click it and Unblock the Notifications











