For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Priyanka Chopra విడాకుల గోల.. మౌనం వీడిన తల్లి.. అసలు నిజం ఏమిటంటే?

  |

  గ్లోబల్ ఐకాన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్న ప్రియాంక చోప్రా ఇటీవల ఎవరు ఊహించని విధంగా పలు అనుమానాలకు బూస్ట్ ఇచ్చింది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ జోనాస్‌ పేరును తొలగించడంతో ఒక్కసారిగా మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఈ స్టార్స్ ఇద్దరి మధ్యలో అభిప్రాయ బేధాలు వచ్చినట్లు వార్తలు రావడంతో విడాకులకు రెడీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. ప్రియాంక ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అనే సందేహాలు వస్తున్న తరుణంలో ఆమె తల్లి ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు.

  విడాకుల కంటే ముందే..

  విడాకుల కంటే ముందే..

  ఇటీవల కాలంలో చాలా మంది సెలబ్రెటీలు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే విడాకులు తీసుకునే ముందు వారు సోషల్ మీడియాలో ముందుగానే ఒక హింట్ అయితే ఇస్తున్నారు. గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పేరును మార్చుకుంటూ విడాకులపై ముందుగానే క్లారిటీ ఇస్తున్నారు. సమంత కూడా విడాకులు కంటే ముందుగానే తన పేరుని మార్చుకొని అనేక రకాల ఊహాగానాలకు తెర లేపింది. ఇక అందరూ ఊహించినట్లుగానే నాగచైతన్యతో ఆమె విడిపోయినట్లు క్లారిటీ వచ్చేసింది.

  ప్రియాంక, నిక్ విడిపోయారు అంటూ

  ప్రియాంక, నిక్ విడిపోయారు అంటూ

  ఇక ఇప్పుడు ప్రియాంక చోప్రా నిక్ జోనస్ మధ్యలో కూడా అభిప్రాయభేదాలు కొనసాగుతున్నట్లు అనేక రకాల కథనాలు పుట్టుకొస్తున్నాయి. ఈ విషయంపై ఇంతవరకు ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు కూడా పెద్దగా వివరణ అయితే ఇవ్వలేదు. దీంతో రూమర్స్ అయితే అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ప్రియాంక చోప్రా నిక్ విడిపోయారు త్వరలోనే విడాకులు ప్రకటన రాబోతున్నట్లు మరికొందరు స్టోరీలు వదిలేశారు.

   పేరును మార్చుకున్న ప్రియాంక

  పేరును మార్చుకున్న ప్రియాంక

  ఇక రూమర్స్ డోస్ ఎక్కువవుతున్న తరుణంలో ప్రియాంక చోప్రా తల్లి మీడియా ముందుకు వచ్చి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.
  2018 లో అంతర్జాతీయ గాయకుడు నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న అనంతరం ప్రియాంక చోప్రా జోనాస్‌ పేరును జత చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ ప్రొఫైల్‌లలో తన పేరును ప్రియాంకగా మాత్రమే మార్చుకొవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఏం జరిగింది అని ప్రశ్నలు చాలానే పుట్టుకొస్తున్నాయి.

   క్లారిటీ ఇచ్చిన తల్లి

  క్లారిటీ ఇచ్చిన తల్లి

  కొనసాగుతున్న సోషల్ మీడియా రూమర్స్ పై ప్రియాంక చోప్రా తల్లి మౌనాన్ని వీడింది. మధు చోప్రా ప్రముఖ టీవీ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.. జరుగుతున్న పుకార్లను కొట్టిపారేశారు. అదంతా చెత్త న్యూస్, పుకార్లు వ్యాప్తి చేయవద్దని ఆమె తెలియజేసింది. ఇటీవల వారు ఎంతో ఆనందంగా దీపావళిని కూడా సెలబ్రేట్ చేసుకున్నారని అంటూ.. కొత్త ఇంట్లోకి కూడా అడుగు పెట్టినట్లు మధు చోప్రా తెలియజేశారు.

  Bigg Boss Telugu 5 : VJ Sunny Elimination | అనీ మాస్టర్‌ ఎలిమినేట్ పక్కా || Filmibeat Telugu
  పదేళ్లు చిన్నవాడు అయినప్పటికీ..

  పదేళ్లు చిన్నవాడు అయినప్పటికీ..

  ఇక ప్రియాంక చోప్రా 2018లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో జరిగిన గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో అంతర్జాతీయ గాయకుడు నిక్ జోనాస్‌తో కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. 'నిక్యాంక' అని ఆప్యాయంగా పిలుచుకునే ఈ సెలబ్రిటీ జంట అభిమానులలో మంచి క్రేజ్ అందుకుంది. ప్రియాంక కంటే నిక్ పదేళ్లు చిన్నవాడు అయినప్పటికీ ఈ జంట చూడముచ్చటగా ఉందని చాలామంది సెలబ్రెటీలు పాజిటివ్ కామెంట్స్ చేశారు.

  English summary
  Actress Priyanka Chopra’s Mother Madhu Chopra about Separation Rumours From Nick Jonas,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X