ఆస్తులన్నీ అమ్ముకుంటోన్న హీరోయిన్.. చివరికి ఆ ఇల్లు కూడా, ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మిస్ వరల్డ్ నుంచి ఇప్పుడు గ్లోబల్ స్టార్ రేంజ్‌కు చేరుకున్నారు ప్రియాంక చోప్రా. అలాగే ఇండియాకు దూరంగా తన భర్త, కూతురితో కలిసి అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక.. ఏదో చుట్టపు చూపుగా ఇండియా వస్తోంది. ఇటీవల సూపర్‌స్టార్ మహేశ్ బాబు - ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తోన్న ఎస్ఎస్ఎంబీ 29లో అవకాశం దక్కించుకుని ఒక్కసారిగా పరిశ్రమకు షాకిచ్చింది ప్రియాంక చోప్రా.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా ప్రతిష్టాత్మక అందాల పోటీలలో పాల్గొన్నారు. అలా 2000లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచి ప్రపంచ సుందరిగా ఎంపికయ్యారు. ఈ విజయం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. మోడల్‌గా ఎండార్స్‌మెంట్స్‌తో పాటు వాణిజ్య ప్రకటనల్లో తీరిక లేకుండా గడిపిన ప్రియాంక చోప్రాకు సినీ పరిశ్రమ నుంచి పిలుపొచ్చింది. 2002లో ఓ తమిళ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రియాంక దాదాపు 23 ఏళ్లుగా వెండితెరను ఏలుతూనే ఉన్నారు.

అందాజ్, క్రిష్, డాన్, ఫ్యాషన్, కమినే, బర్ఫీ, మేరీకోమ్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలతో బాలీవుడ్ టాప్ స్టార్‌గా నిలిచారు. జాతీయ చలన చిత్ర అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులతో పాటు భారత ప్రభుత్వం చేతుల మీదుగా పద్మశ్రీ, టైమ్స్ ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ఒకరిగా నిలిచారు. ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు, వెళ్లారు కానీ ప్రియాంక చోప్రా మాత్రం నేటికీ స్టార్‌గా కొనసాగుతూనే ఉన్నారు.
సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లోనే కాకుండా చాలా భాషల్లోనూ హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత హాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. అక్కడ ఈ భామ పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని ఆంగ్ల చిత్రాలు, ప్రైవేట్ ఆల్బమ్‌లు కూడా చేసింది . అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్‌తో ప్రేమలో పడిన ప్రియాంక చోప్రా.. ఏజ్‌లో చిన్నోడే అయినా 2018 డిసెంబర్‌లో అతడితో ఏడు అడుగులు నడిచింది. వీరి పెళ్లికి సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత పూర్తిగా బాలీవుడ్‌కు, భారతదేశానికి దూరమైన ప్రియాంక చోప్రా భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడింది.
సినిమాలు, షూటింగ్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయిస్తూనే ఉన్నారు ప్రియాంక చోప్రా. భర్త, కుమార్తెతో కలిసి విహారయాత్రలకు వెళ్లడంతో పాటు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తున్నారు. అయితే అనూహ్యంగా మహేశ్ - రాజమౌళిల ఎస్ఎస్ఎంబీ 29లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అయితే అది హీరోయిన్‌గానా? లేక మరేదైనా పాత్ర కోసమా? అన్నది మాత్రం తెలియరాలేదు. త్వరలోనే ప్రియాంక రోల్ ఏంటన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అయితే కారణం తెలియదు కానీ ప్రియాంక చోప్రా భారత్‌లో ఉన్న తన ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారు. 2021లో వెర్సోవాలోని రెండు ఆస్తులు, 2023లో లోఖండ్‌వాలాలోని రెండు ఖరీదైన పెంట్ హౌస్‌లను కూడా ఇప్పటికే విక్రయించిన సంగతి తెలిసిందే . తాజాగా ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతం అంథేరిలోని నాలుగు ఫ్లాట్‌లను కూడా ప్రియాంక చోప్రా విక్రయించినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఒబెరాయ్ స్కై గార్డెన్స్‌లోని 18వ అంతస్తులో మూడు ఫ్లాట్స్‌ను వరుసగా రూ.3.45 కోట్లు, రూ.2.85 కోట్లు, రూ.3.52 కోట్లకు విక్రయించారు. అలాగే 19వ అంతస్తులోని జోడీ యూనిట్‌ను రూ.6.35 కోట్లకు అమ్మేశారు. ఈ నాలుగు ఫ్లాట్ల విక్రయం ద్వారా దాదాపు రూ.16.17 కోట్లు వచ్చాయి. మార్చి 3న ఈ నాలుగు ఫ్లాట్ అమ్మకం, రిజిస్ట్రేషన్ పనులను ప్రియాంక చోప్రా పూర్తి చేసినట్లుగా టాక్. సినిమాల విషయానికి వస్తే ఎస్ఎస్ఎంబీ 29తో పాటు హాలీవుడ్‌లో హెడ్స్ ఆఫ్ స్టేట్, ది బ్లఫ్ చిత్రాలలోనూ .. సిటాడెల్ అమెరికన్ సిరీస్‌లోనూ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











