పుష్ప తరువాత మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందన్న.. బాలీవుడ్ హీరోతో యాక్షన్ ప్రాజెక్ట్?

ఇటీవల కాలంలో సౌత్ ఇండస్ట్రీలో వరుస విజయాలు అందుకుంటున్న రష్మిక మందన్న బాలీవుడ్ లో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు గట్టిగానే చూస్తోంది. ఛలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా రష్మిక మందన్న జాతకం పూర్తిగా మారిపోయింది అనే చెప్పాలి. ఎలాంటి సినిమా చేసినా కూడా కమర్షియల్ గా ఏదో ఒక విధంగా సక్సెస్ అందుకుంటోంది. మధ్యలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా రష్మిక మందన తన ఆలోచనా విధానంతో సరికొత్త కథలను సెలెక్ట్ చేసుకుని ముందుకు సాగుతోంది.

సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమా అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో తో నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల రష్మిక మందన్న పుష్ప సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా హిందీలో కూడా వందకోట్ల కలెక్షన్స్ అందుకుని అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఈ సినిమాకు సంబందించిన సెకండ్ పార్ట్ కూడా అంతకు మించి అనేలా ఉంటుంది కాబట్టి తప్పకుండా రష్మిక మందన్న మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Actress Rashmika Mandanna another action project in bollywood

అయితే రష్మిక మందన్న వీలైనంత వరకు సినిమాలలో తన క్యారెక్టర్ ను హైలెట్ అయ్యే విధంగా కథలను సెలెక్ట్ చేసుకుంటుంది. త్వరలోనే ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో సినిమాను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అలాగే యువ హీరో రణ్ బీర్ కపూర్ అనిమల్ సినిమాలో రష్మిక మందన్నను మేయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాలో హీరోయిన్ కోసం గత కొన్ని నెలలుగా హీరోతో కలిసి చర్చలు జరుపుతున్నాడు.

ఇక రీసెంట్ గా రష్మిక మందన్న పేరు ప్రస్తావన తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. కూడా ఆ హీరోతో నటించేందుకు రష్మీక మందన్న కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే హిందీ లో రష్మిక మందన మిషన్ మజ్ను అనే ఒక సినిమా చేసింది. సిద్ధార్థ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్ ల్ విడుదల కాబోతోంది. అలాగే బాలీవుడ్ లెజెండ్ అమితాబచ్చన్ సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతొంది. గుడ్ బై అనే ఆ సినిమాలో కూడా అమ్మడి పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇక ఈ సినిమాలతో పాటు అమ్మడు పుష్ప సెకండ్ పార్ట్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగాతో ఎనిమల్ బాలీవుడ్ సినిమా కోసం రష్మిక మందన్నను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ బ్యూటీకి ఆ ఆఫర్ నిజంగా వస్తుందా లేదా తెలియాలి అంటే ఆఫీషియల్ గా క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X