బ్రేకింగ్: బెయిల్ కోసం రియా చక్రవర్తి పాట్లు.. ఇప్పుడైనా కనికరిస్తారా?
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసు డ్రగ్స్ వివాదంతో ఊహించని యూ టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రియా చక్రవర్తి ఎలాగైనా బయటకు రావాలని చాలా కష్టపడుతోంది. రియా చక్రవర్తిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించగా ఇక ఆమె ఫైనల్ గా మంగళవారం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

బెయిల్ కోసం కష్టపడుతోన్న రియా..
సుశాంత్ సింగ్ ఎప్పుడైతే మరణించాడో అప్పటి నుంచి రియా జీవితం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అతని డెత్ కేసులో అనేక రకాల విచారణలను ఎదుర్కొన్న రియా చివరకు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది. రియా ఈ విధంగా కస్టడీలోకి వెళుతుందని ఎవరు అనుకోలేదు. ఇక ముందు నుంచే బెయిల్ కోసం కష్టపడుతోంది.

14రోజులు జ్యుడీషియల్ కస్టడీలోనే..
రియా చక్రవర్తి మొత్తానికి మంగళవారం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. రియాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) సెప్టెంబర్ 8 న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో సంబంధం ఉన్న మాదకద్రవ్యాల కేసులో పాల్గొన్నందుకు సెప్టెంబర్ 22 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్‌కు తరలించారు.

ఏ మాత్రం రిస్క్ తీసుకోవద్దని..
కస్టడీకి తరలించిన రోజు నుంచి కూడా రియా కుటుంబ సభ్యులు బెయిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. రియా తన కేసును వాదించేందుకు ఖరీదైన లాయర్ ని కూడా ఏర్పాటు చేసుకుంది. కానీ ఇంతవరకు ఆమెకు కనీసం బెయిల్ కూడా రాలేదు. ఏ మాత్రం రిస్క్ తీసుకోవద్దని అధికారులు ఆమెను అనేక రకాల విషయాలపై ఇన్వెస్టిగేషన్ చేయాలని అనుకుంటున్నారు.
Recommended Video

సీరియస్ అయిన హీరోయిన్స్
రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్న తరువాత కేసు విషయంలో అనేక రకాల పుకార్లు అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. రియా కొంతమంది స్టార్స్ పేర్లు కూడా బయటపెట్టిందని వార్తలు రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక అబద్ధపు వార్తలపై కొంతమంది నటీమణులు చాలా సీరియస్ అయ్యారు. కోర్టు వరకు కూడా వెళతామని చెప్పడంతో ఆ రూమర్స్ డోస్ కాస్త తగ్గినట్లు అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











