Ruchi Gujjar: లైవ్‌లో నిర్మాతను చెప్పుతో కొట్టిన స్టార్ హీరోయిన్.. అసలేం జరిగిందంటే?
చిత్ర పరిశ్రమలో నటీనటులకు పారితోషికం చెల్లింపు విషయంలో ఏళ్లుగా వివాదాలు నడుస్తూనే ఉంటాయి. ఎంతో మంది నటీనటులు తమకు పారితోషికాలు బకాయిపడిన విషయాన్ని బహిరంగంగానే వెల్లడించారు. కొందరు కోర్టు మెట్లెక్కిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా పారితోషికం విషయంలో ఓ నిర్మాతను స్టార్ హీరోయిన్ అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..
టిక్‌టాక్‌తో కెరీర్ ప్రారంభం
బాలీవుడ్ నటి రుచి గుజ్జర్.. ఈమెకు సౌత్‌లో అంతగా పాపులారిటీ లేదు కానీ హిందీ బెల్ట్‌లో మాత్రం ఫుల్ ఫేమస్. రాజస్థాన్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. తొలుత టిక్‌టాక్ వీడియోలతో యువతో క్రేజ్ సంపాదించుకుంది గుజ్జర్. అయితే గాల్వన్ లోయలో భారతీయ సైనికులపై చైనా సైన్యం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం .. చైనా యాప్‌లను నిషేధించింది. ఇందులో టిక్‌టాక్ కూడా ఉంది. దీంతో రుచి ఇన్‌స్టాగ్రామ్, మోజ్ యాప్‌లతో కొత్తగా తన ప్రయాణం ప్రారంభించారు. యువతను టార్గెట్ చేసే కంటెంట్‌తో అనతి కాలంలోనే ఆమె సెలబ్రెటీగా మారిపోయారు.

కేన్స్ ఫెస్టివల్‌లో సందడి
ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో రుచికి మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫ్యాషన్, బ్యూటీ, లైఫ్ స్టైల్ బ్రాండ్స్‌కు ప్రచారం కల్పిస్తూ భారీగా సంపాదిస్తోంది. ఇందుకోసం ఒక్కో ప్రొడక్ట్‌పై 50 వేల నుంచి 1.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. వీటితో పాటు మోడలింగ్, మ్యూజిక్ వీడియోలతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్‌తోనూ యువతలో మరింత పాపులరైంది. 2023లో మిస్ హర్యానాగా నిలిచిన రుచి గుజ్జర్.. హీరోయిన్లు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలనే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఫోటోతో కూడిన నెక్లెస్‌ను ధరించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
నిర్మాతపై దాడి
ఈ పాపులారిటీతో రుచి గుజ్జర్‌కు సినిమాలలోనూ అవకాశాలు వచ్చాయి. నటుడు, దర్శకుడు మాన్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన సో లాంగ్ వ్యాలీ సినిమాలో ఆమె నటించారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుండగా.. చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా జూలై 25న ముంబైలోని సినీపోలిస్ థియేటర్ వద్ద ఓ కార్యక్రమం జరిగింది. దీనికి మాన్‌సింగ్‌తో పాటు చిత్ర యూనిట్ హాజరైంది. ఈ క్రమంలో హఠాత్తుగా అక్కడికి వచ్చిన రుచి గుజ్జర్.. మాన్‌సింగ్‌పై దాడి చేసింది. తనకు ఇవ్వాల్సిన పారితోషికాన్ని మాన్ సింగ్ ఇవ్వలేదని నినాదాలు చేసింది.
25 లక్షలు ఇవ్వకపోవడంతోనే
అంతేకాదు.. నిర్మాతలు గాడిదలపై కూర్చొని ఉన్నట్లుగా ఉన్న కొన్ని ఫ్లకార్డులను ప్రదర్శించడం కలకలం రేగింది. ఈ సందర్భంగా రుచి గుజ్జర్ మాట్లాడుతూ.. మాన్ సింగ్ తనకు 25 లక్షల రూపాయలు చెల్లించాలని తెలిపారు. ఎన్నో రోజులుగా అడుగుతున్నప్పటికీ ఏమాత్రం పట్టించకోలేదని.. ఈ కారణంగానే ఇలా చేయాల్సి వచ్చిందని రుచి గుజ్జర్ పేర్కొంది. గతంలో చేసిన పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌కు సంబంధించి మాన్ సింగ్ రెమ్యునరేషన్ చెల్లించలేదని గుజ్జర్ పేర్కొన్నారు. మరోవైపు.. ఊహించని ఈ పరిణామంతో చిత్ర యూనిట్ ఉలిక్కిపడింది. రుచిని వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మాన్ సింగ్‌పై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











