టాలీవుడ్ హీరోయిన్ శృంగార వీడియోలు వైరల్.. కోహ్లీ మరదలు ఇలా చేసిందేంటి!
తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ మంది మాత్రమే హీరోయిన్లుగా క్యూట్ లుక్స్‌తో పాటు బెస్ట్ యాక్ట్రెస్‌గా మంచి పేరును తెచ్చుకున్నారు. అలాంటి వారిలో రుహానీ శర్మ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో మాయ చేస్తోన్న ఈ భామ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. అదే సమయంలో బాలీవుడ్ సహా పలు ఇండస్ట్రీల్లోనూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రుహానీ శర్మ ఇటీవలే ఓ సినిమాలో నటించింది. ఇందులో ఆమె శృంగార సన్నివేశాలతో రచ్చ చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!
అప్పట్లోనే అలా పాపులర్
మోడల్‌గా చేస్తోన్న సమయంలోనే రుహానీ శర్మ యమా హైలైట్ అయింది. దీని తర్వాత చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వ్యవహరించింది. ఆ తర్వాత పంజాబీలో 'కుడి టు పటాకా', 'కర్వా చౌత్', 'పటియాలే వాల్‌నూ' వంటి ఆల్బమ్స్‌లో కనిపించింది. వీటికి మంచి స్పందన రావడంతో రుహానీ సెన్సేషన్ అయింది. అలాగే దేశ వ్యాప్తంగానూ పాపులారిటీని సొంతం చేసుకుంది.

తెలుగులోకి.. ఆ మూవీల్లో
రుహానీ శర్మ 'కడాయిసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఈ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే 'చి ల సౌ' అనే చిత్రంతో తెలుగులోకి వచ్చింది. ఈ మూవీకి నేషనల్ అవార్డు దక్కడంతో ఆమెకూ పేరు తెచ్చింది. దీని తర్వాత తెలుగులో వరుసగా 'హిట్ 1', 'థర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' మూవీలు చేసింది.

యమా సినిమాలు చేస్తూ
టాలీవుడ్‌లో రుహానీ శర్మకు ఎన్నో అవకాశాలు లభించాయి. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ వరుసగా సినిమాలు చేసింది కానీ.. ఇందులో హిట్ మినహా భారీ విజయాన్ని అందుకోలేదు. అయినా రుహానీ 2019లో 'పాయిజన్', తెలుగులో 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్ చేసింది. ఇటీవలే 'HER Chapter 1', 'సైంధవ్' మూవీలోనూ చేసింది. కానీ, ఇవి ఆమెకు అనుకున్న హిట్ కాలేదు.

ఆ సినిమాలతో సందడి
యాక్టింగ్‌తో పాటు గ్లామర్ పరంగానూ మెప్పిస్తోన్న రుహానీ శర్మ ఇటీవలే తెలుగులో ఈ ఏడాదిలో 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీలోనూ కీలక పాత్రను పోషించింది. కానీ, ఈ చిత్రం కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఇక, ఇప్పుడామె వేరే భాషల్లోనూ మూవీలు చేస్తోంది. ఇక, ఇప్పుడు రుహానీ తమిళంలో 'మాస్క్' అనే సినిమాను కూడా చేస్తోంది. అలాగే, పలు సిరీస్‌లకు సిగ్నల్ ఇచ్చింది.
ఆగ్రా మూవీతో సెన్సేషన్
డీసెంట్ రోల్స్ చేస్తూ మెప్పిస్తోన్న హీరోయిన్ రుహానీ శర్మ 'ఆగ్రా' అనే హిందీ చిత్రంలో కూడా నటించింది. కను బెహ్ల్ తెరకెక్కించిన ఈ సినిమాను 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 24 మే 2023న డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్‌లో ప్రదర్శించారు. అలాగే, ఆగస్ట్ 2023లో ఇది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ఎంపికైంది. ఈ చిత్రంతో రుహానీ శర్మ సెన్సేషన్ అయిపోయింది.
శృంగార వీడియోలతో
'ఆగ్రా' మూవీలో రుహానీ శర్మ కొన్ని శృంగార సన్నివేశాల్లో మితిమీరిపోయి నటించింది. ఇప్పుడు ఈ క్లిప్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ముఖ్యంగా ఆమె రొమాన్స్ చేస్తూ, హావభావాల చూపిస్తూ పచ్చిగా కనిపించింది. దీంతో ఇది చూసిన తెలుగు ప్రేక్షకులు అవాక్ అవుతున్నారు. ఫలితంగా ఈ వీడియోలు విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.


Click it and Unblock the Notifications











