దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా.. దేవుడిని ప్రార్థించండి అంటూ భార్య సైరా భాను..

బాలీవుడ్ దిగ్జజ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదనే విషయాన్ని ఆయన భార్య సైరా భాను తాజా ఇంటర్యూలో వెల్లడించింది. ఆమె చెప్పిన విషయాలతో ఆయన అభిమానులు ప్రస్తుతం ఆందోళనలో మునిగిపోయారు. సైరా భాను ఇంటర్వ్యూ తర్వాత పలువురు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. ఇక దిలీప్ కుమార్ ఆరోగ్యం గురించి వివరాల్లోకి వెళితే..

ఆరోగ్య పరంగా బలహీనంగా

ఆరోగ్య పరంగా బలహీనంగా

ఇటీవల జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో సైరా భాను మాట్లాడుతూ.. ఆయన ఆరోగ్యం బాగా ఉండటం లేదు. ఆరోగ్య పరంగా చాలా బలహీనంగా ఉన్నారు. కేవలం ఇంటిలోని హాల్‌ నుంచి అతడి రూమ్ వరకు మాత్రమే నడవ గలుగుతున్నారు. ఆయన ఇమ్యూనిటీ లెవెల్ చాలా తక్కువగా ఉంది ఆయన ఆరోగ్యం గురించి దేవుడిని ప్రార్థించండి అంటూ చెప్పారు.

దిలీప్ కుమార్ అంటే ఆరాధ్యభావం

దిలీప్ కుమార్ అంటే ఆరాధ్యభావం

దిలీప్ కుమార్ గురించి ఎమోషనల్‌గా మాట్లాడుతూ.. ఆయన అంటే మాటల్లో చెప్పలేనంత ఆరాధ్య భావం ఉంటుంది. ఆయన తాకడం, ఆయనతో సన్నిహితంగా ఉండటమనే విషయాలు ప్రపంచంలోనే నాకు గొప్ప విషయాలు. ఆయనపై ఉన్న ప్రేమను పక్కన పెడితే.. ఆయనే నాకు ఆరాధ్యం, చివరి శ్వాస అని సైరా భాను అన్నారు.

సోదరుల మృతితో దిలీప్ కుమార్ విషాదంలోకి

సోదరుల మృతితో దిలీప్ కుమార్ విషాదంలోకి

దిలీప్ కుమార్‌ను ఇటీవల కాలంలో కొన్ని విషాద సంఘటనలు వెంటాడుతున్నాయి. ఆయన సోదరులు ఎహసాన్ భాయ్, అస్లాం భాయ్ ఇద్దరూ కరోనావైరస్ కారణంగా మరణించారు. దాంతో ఈ ఏడాది వారి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవద్దని నిర్ణయించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసి కరోనా బాధితుల క్షేమం కోసం ప్రార్థించాలని అభిమానులను కోరారు.

Recommended Video

Udaya Bhanu Condolences To Her Adopted Sister
 వివాహ వార్షికోత్సవం రద్దు

వివాహ వార్షికోత్సవం రద్దు

బాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన దిలీప్ కుమార్, సైరా భాను ప్రేమించి పెళ్లి చేసకోన్నారు. 1966లో వారద్దరి వివాహం జరిగింది. 2020 నాటికి వారి పెళ్లి జరిగి 54 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో వివాహ వార్షిక వేడుకను జరుపుకోవాలని ఘనంగా నిర్ణయించారు. కానీ దిలీప్ కుమార్ సోదరులు మరణించడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొన్నట్టు సైరా భాను తాజా ఇంటర్యూలో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X