14 జూన్.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ తరహాలోనే..నటి సంచిత ఉగాలే అనుమానాస్పద మరణం.. ఫ్యామిలీ సంచలన ఆరోపణలు
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీ 2020 సంవత్సరంలో తన నివాసంలో ఉరి వేసుకొని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం అప్పట్లో సంచలనం రేపింది. ఆయన మరణం వెనుక అప్పటి ప్రభుత్వ ముఖ్య నేతలు ఉన్నారని ఆరోపణలు రావడంతో ఆయన మృతి కేసును సీబీఐ విచారణకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన మరణం జరిగి 6 ఏళ్ల పూర్తి అయింది.
అయితే అదే రోజు టెలివిజన్ నటి సంచిత ఉగాలే కూడా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. తాను కూడా ఉరి వేసుకొని సుశాంత్ తరహాలోనే మృతి చెందడం, ఆమె కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆమె మృతి మీడియాలో చర్చనీయాంశమైంది. సంచిత మృతి తర్వాత ఆమె సోదరుడు ఆకాశ్ సతీష్ ఉగాలే వ్యక్తం చేసిన అనుమానాలు ఆమెది హత్యానా? అనే విధంగా సందేహాలు వచ్చాయి. సంచిత సోదరుడు మీడియాకు వెల్లడించిన సంచలన విషయాలు ఏమిటంటే?

జూన్ 14వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో నా సోదరి సంచిత ఉగాలే ఆత్మహత్య చేసుకొన్నారు. ఆమె పోస్ట్ మార్టం కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నాల్లో ఉన్నాం. ఆ సమయంలో నా స్నేహితుడు ఒక ఇన్స్‌టాగ్రామ్ లింక్ పంపించాడు. ఆ లింక్ అకౌంట్ నా సోదరి పేరు, ఫోటోతో ఉంది. ఆ అకౌంట్‌లో సుశాంత్ సింగ్ వీడియోలు ఉన్నాయి. అందులో ఏం రాసి ఉన్నదంటే.. మళ్లీ జూన్ 14వ తేదీ. అదే రోజు సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకొన్నారు కదా. అదే రోజు నా చెల్లెలు కూడా సూసైడ్ చేసుకొన్నారు. అందులో వీ మిస్ యూ సుశాంత్ సార్. దీంతో ఒక విషయం స్పష్టమైంది. నా సోదరి పేరు మీద ఐడీ క్రియేట్ చేశారు. జూన్ 2వ తేదీన క్రియేట్ అయిందని చెప్పడానికి ఒక వీడియో పోస్ట్ చేశారు అని ఆకాశ్ తెలిపారు.
నా చెల్లెల్ని బతకడానికి భయపడింది. ఇండస్ట్రీ వర్గాలు దారుణంగా తొక్కి పెట్టారు. ఆమె కెరీర్‌తో ఆటాడుకొన్నారు. ఎలాగైతే సుశాంత్‌ను అణగదొక్కి ఆయన సూసైడ్‌కు కారణమయ్యారో అలాగే నా చెల్లెలు విషయంలో అదే జరిగింది. ఇలాంటి మరణాల వెనుక పెద్దల హస్తం ఉంటుందనే విషయం తెలిసిందే. అల్టిమేట్‌గా పవర్ గేమ్ నడుస్తుంటుంది. మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిని అన్ని రకాలుగా అణగదొక్కుతారు. ఈ విషయాన్ని భారతీయ ప్రజలందరూ గుర్తించాలి అని ఆకాశ్ అన్నారు.
నా చెల్లెలు మరణంపై ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలు ఈ ఘటనపై స్పందించాలి. ఇండస్ట్రీ మాఫియా కారణంగానే నా చెల్లెలు మరణించింది. నా చెల్లెలు మరణంపై దర్యాప్తు నిజాయితీగా జరిగాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి అని ఆయన అన్నారు.
సంచిత తన కెరీర్‌లో కుంకుమ్ భాగ్య, వాగ్లే కి దునియా, దిల్ వాలీ దుల్హా లే జాయేంగే సీరియల్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకొన్నారు. బుల్లితెర మీదనే కాకుండా ఆమె ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లో నటించారు. విక్రాంత్ మెస్పీ నటించిన క్రైమ్ ఆజ్ కల్, జీ5 స్ట్రీమింగ్ అవుతున్న సైలెన్స్ 2: ది నైట్ ఓల్ బార్ షూట్‌అవుట్ చిత్రంలో మనోజ్ బాజ్‌పేయ్‌తో కలిసి నటించారు. అలాగే విక్కీ కౌశల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఛావా సినిమాలో తారాభాయ్‌గా నటించి మెప్పు పొందారు. కెరీర్ పరంగా రాణిస్తున్న సమయంలోనే ఇదిలా సంచిత ఉగాలే ముంబైలోని నాలాసోపారా ప్రాంతంలో నివాసంలో సోమవారం (జూన్ 14వ తేదీ) రాత్రి 7 గంటల ప్రాంతంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మరణించారు. ఆమె వయసు 22 సంవత్సరాలు. తన తండ్రి ఫిర్యాదు మేరకు ఈ మరణాన్ని యాక్సిడెంటల్ డెత్‌గా కేసు నమోదు చేశారు.


Click it and Unblock the Notifications