సల్మాన్ ముఖంపై కొట్టిన హీరోయిన్.. వీడియో వైరల్.. అతను పెళ్లి చేసుకోకపోవడానికి ఆమె కారణం!
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే అది కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఎన్నో ఏళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా, ఖాన్ త్రయంలో ఒకరిగా వెలుగొందుతూ వస్తున్నాడు.
సల్మాన్ ఖాన్ నిజ జీవితంలో లవ్ అఫైర్స్ సంగతి పక్కన పెడితే 57 ఏళ్ల వయసు మీద ఉన్న ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు. ఆయన పెళ్లిపై ఇప్పటికీ అనేకసార్లు సోషల్ మీడియా వేదికగా చర్చ వచ్చింది. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ ముఖంపై ఆయన మాజీ ప్రేయసీ, ఒకప్పటి హీరోయిన్ పంచ్ చేయడంతో మళ్లీ ఈ టాపిక్ హాట్ టాపిక్ అవుతోంది.

టైగర్ 3 షూటింగ్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు పరిచయం అక్కర్లేదు. 50 ఏళ్ల వయసు దాటిన స్టిల్ మోస్ట్ బ్యాచిలర్‌గా ఉన్న సల్లూ భాయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ పఠాన్ మూవీలో అదిరిపోయే కెమియే చేశాడు. ప్రస్తుతం టైగర్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్న సల్లూ భాయ్ తాజాగా 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాతో ఎంటర్టైన్ చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
పూజాకు అన్నయ్యగా: పాన్ ఇండియా సినిమాగా ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన తెలుగు బుట్టబొమ్మ పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా చేసింది. అంతేకాకుండా విక్టరీ వెంకటేష్, భూమిక కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో బిగ్ బాస్ బ్యూటి షెహనాజ్ గిల్ వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో పూజా హెగ్డెకు వెంకటేష్ అన్నయ్య పాత్ర పోషించారు.

సౌత్ సినిమా తరహాలో: పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాకు హిందీ రీమెక్ గా వచ్చిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాలో ఒక పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చాడు. అయితే ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తుంది. తొలి రోజు అయితే సల్మాన్ కెరీర్ లోనే ఘోరమైన కలెక్షన్స్ వచ్చాయి. అలాగే ఈ సినిమాను సౌత్ సినిమాల ఫ్లేవర్స్ తో నింపేసి చిత్రీకరించారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
బ్రేకప్ కావడం: ఇక సల్మాన్ సినిమా సంగతి ఎలా ఉన్నా గతంలో ఆయన నడిపిన ప్రేమయాణాల సంగతి తెలిసిందే. అనేక మంది హీరోయిన్లల లవ్ అఫైర్ నడిపించిన సల్లూ భాయ్ చివరికీ మాత్రం బ్యాచిలర్ గానే మిగిలిపోయాడు. వారిలో ఏ ఒక్కరు కూడా సల్మాన్ కు జీవిత భాగస్వామి కాలేదు. నచ్చినన్ని రోజులు ప్రేమించి.. తర్వాత బ్రేకప్ కావడం సల్మాన్ జీవితంలో చాలా కామన్ అంశంగా మారింది.

వెనుకే ఉండి పంచ్: అయితే తాజాగా సల్మాన్ ఖాన్ అతని సోదరి అర్పితా ఖాన్-ఆయుష్ శర్మ దంపతులు ఇచ్చిన ఈద్ పార్టీకి వెళ్లాడు. ముంబైలో శనివారం జరిగిన ఈ ఈద్ పార్టీకి పలువురు హిందీ చిత్రసీమ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి, ఒకప్పటి హీరోయన్ సంగీతా బిజ్లానీ కూడా ఉంది. ఈ పార్టీలో సల్మాన్ ఖాన్ వెనుకే ఉన్న సంగీతా అతని ముఖంపై పంచ్ ఇచ్చింది. అది పట్టించుకోకుండా మరొకరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు సల్మాన్.
మళ్లీ సల్మాన్ దగ్గరికి..: అయినా సల్మాన్ ముఖంపై మరోసారి పంచ్ ఇచ్చింది సీనియర్ హీరోయిన్ సంగీతా బిజ్లానీ. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. "సల్మాన్ పెళ్లి చేసుకోకుండా మిగిలి పోవడానికి కారణం ఆవిడే", "సల్మాన్ తో నిశ్చితార్థం చేసుకుని క్రికెటర్ ను పెళ్లి చేసుకుంది. తర్వాత అతనికి విడాకులు ఇచ్చి మళ్లీ సల్మాన్ చెంతకు ఒక ఫ్రెండ్ గా చేరుకుంది", "ఆమె మరొకరిని పెళ్లి చేసుకునేలోపు మీరే ఆమెను వివాహం చేసుకోండి" అని అంటున్నారు.


Click it and Unblock the Notifications











