కారు, ఆస్తులన్నీ అమ్ముకొన్నా.. రోడ్డుపై పడ్డ టెలివిజన్ నటి.. సహాయం కోసం ధీనంగా!

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది జీవితాలతో ఆడుకొంటున్నది. సినీ పరిశ్రమ స్తంభించడంతో ఎంతో మంది నటీనటులు, రోజువారీ వేతన కార్మికులు రోడ్డుపైన పడ్డారు. ముఖ్యంగా వయోభారంతో బాధపడుతున్న సీనియర్ నటులకు జీవితం మరింత దుర్బరంగా మారింది. తాజాగా సీనియర్ టెలివిజన్ నటి షగుఫ్తా ఆలీ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తాజాగా ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కష్టాలను చెప్పుకొంటూ...

బతుకు రోడ్డుపైకి రావడంతో

బతుకు రోడ్డుపైకి రావడంతో

టెలివిజన్ ఇండస్ట్రీలో షగుఫ్తా ఆలీ కెరీర్ దాదాపు 30 ఏళ్లకుపైగానే గడిచింది. అప్పట్లో టెలివిజన్ రంగంలో ఆమె హీరోయిన్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది. ఎంతో గౌరవంగా బతికిన ఆమె ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో బతుకు రోడ్డుపైకి వచ్చింది. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ షగుప్తా ఆలీ తన బాధలను వెల్లడించింది.

ఆరోగ్య సమస్యల్లో కూరుకుపోయి

ఆరోగ్య సమస్యల్లో కూరుకుపోయి

ప్రస్తుతం 54 సంవత్సరాల వయసులో అనేక వ్యాధులతో బాధపడుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా వయసు మీద పడిన తల్లి, తన కజిన్ కూతురు సంరక్షణ కూడా ఆమెపై పడటంతో జీవితం మరింత సమస్యల్లో కూరుకుపోయింది. మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని షుగప్తా ఆలీ తన గోడును మీడియాతో పంచుకొన్నారు.

నాలుగేళ్లుగా ఆఫర్లు లేక..

నాలుగేళ్లుగా ఆఫర్లు లేక..

షుగుఫ్తా ఆలీ మీడియాతో మాట్లాడుతూ... గత నాలుగేళ్లు యాక్టింగ్ ఆఫర్లు రావడం లేదు. పని చేయడానికి అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక సమస్యలు భారీగా ఎదురువుతున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం క్యాన్సర్ బారిన పడటం, అందుకోసం భారీగా ఖర్చు కావడంతో చేతిలో సంపాదన అంతా కరిగిపోయింది. క్యాన్సర్ వ్యాధి నయం అయిందనే సంతోషాన్ని అనుభవించకముందే.. నాకు డయాబెటీస్ వ్యాధి పీడించడం మొదలుపెట్టింది అని షుగప్తా ఆలీ పేర్కొన్నారు.

ఆస్తులు, కార్లు అమ్మి..

ఆస్తులు, కార్లు అమ్మి..

ఆర్థిక సమస్యలు మరింత పెరగడంతో ఆస్తులన్నీ అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నా కారు, నగలు అమ్మేశాను. ప్రస్తుతం హాస్పిటల్ వెళ్లాలంటే ఆటోలో కష్టంగా వెళ్లాల్సి వస్తున్నది. నాకు ఎవరి నుంచి సపోర్టు లభించడం లేదు. దయచేసి ఎవరైనా నన్ను ఆర్థికంగా ఆదుకొంటే మేము బతికి బయటపడుతాం అని ధీనంగా షుగప్తా ఆలీ ఆర్థించింది. నా పరిస్థితి చూసి నటి నీనా గుప్తా నాకు కొంత మేరకు సహాయం చేసింది అని చెప్పారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
 షుగప్తా ఆలీ ఆదుకొంటామని..

షుగప్తా ఆలీ ఆదుకొంటామని..

షుగప్తా ఆలీ పరిస్థితి మీడియాలో రావడంతో సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ (సింటా) స్పందించింది. మా సంస్థలో సభ్యురాలైన షుగుప్తాకు ఆదుకొంటామని ప్రతినిధులు తెలిపారు. ఆమె ఇంటికి వెళ్లి ఆర్థికంగా ఆదుకొంటాం. ఆమెతో ఎప్పుడూ టచ్‌లో ఉంటూ వైద్య, ఆర్థిక అవసరాలను తీర్చుతాం. ట్రేడ్ యూనియన్ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా మేము ఆమెకు ఎలాంటి సహాయం కావాల్సిన ఆదుకొంటాం అని సింటా నిర్వాహకులు, ప్రతినిధులు వెల్లడించారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X