హీరోయిన్‌ను తిడుతూ... ఆమె డ్రైవర్ మీద దాడి, ఏం జరిగింది?
బాలీవుడ్ హీరోయిన్ షమితా శెట్టిని దూషిస్తూ ఆమె కారు డ్రైవర్ మీద ముగ్గురు వ్యక్తులు దాడి చేసిన ఘటన ముంబైలో మంగళవారం చోటు చేసుకుంది. థానేలోని వివియానా మాల్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం.
షమితా శెట్టి కారులో వెళుతుండగా ఓ బైకర్ ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రయాణిస్తూ ఆమె కారును ఢీకొట్టారు. ఈ క్రమంలో డ్రైవర్, బైకర్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మాట మాట పెరగడంతో ఆ ముగ్గూరు డ్రైవర్ మీద దాడి చేసినట్లు సమాచారం. వారు అలా చేయడాన్ని ప్రశ్నించిన షమితా శెట్టిని కూడా వారు దూషించినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై షమితా శెట్టి రబోడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఐపీసీ సెక్షన్ 279, 323, 504, 506, 427, 34 కింద కేసు నమోదు చేశారు. దాడితో పాటు, త్రిబుల్ రైడింగ్, యాక్సిడెంట్ కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
బాలీవుడ్ చిత్రం మొహబత్తీన్ సినిమా ద్వారా హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన షమితా శెట్టి.. క్యాష్, మొహబ్బత్ హో గయి తుమ్ సే, జహెర్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె 'ఖత్రియోంకి ఖిలాడి 9' అనే టీవీ షో చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











