కరోనా పాజిటివ్‌తో షూటింగ్.. ప్రముఖ నటిపై కేసు నమోదు
కొంతమంది సినీ తారలు ప్రవర్తించే తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బాధ్యతాయుతంగా నలుగురికి చెప్పాల్సిన హోదాలో ఉండి రూల్స్ ని బ్రేక్ చేస్తుంటారు. ఇటీవల ఒక బాలీవుడ్ నటి కూడా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడం హాట్ టాపిక్ గా మారింది. అయితే అధికారులు సమాచారం అందుకున్న వెంటనే ఆమెపై ఎఫ్‌ఐఆర్ ను నమోదు చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ విషయాన్ని లెక్క చేయడం లేదు
ఏడాది వరకు అందరిని భయానికి గురి చేసిన కరోనా వైరస్ ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని అంతా భావిస్తున్నారు. కానీ వైరస్ తీవ్రత ఇంకా తగ్గలేదని వైద్యులు ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలని చెబుతున్నప్పటికి కొంతమంది సెలబ్రెటీలు కూడా ఆ విషయాన్ని లెక్క చేయడం లేదు.

కరోనాతోనే షూటింగ్..
అయితే ఇటీవల కరోనావైరస్ పరీక్షల్లో పాజిటివ్ గా నిర్దారణ అయినప్పటికీ ఒక స్టార్ నటి షూట్ కొనసాగించింది. దీంతో ఆ ప్రముఖ నటిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. బిఎమ్‌సి, ముంబై పోలీసుల అధికారిక ట్విట్టర్ పేజ్ లో ఎఫ్‌ఐఆర్ కాపీని షేర్ చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిరాకు తెప్పించిన నటి
అయితే ఆ నటి ఎవరనే విషయాన్ని పూర్తిగా బయటకు రానివ్వడం లేదు. నటికి కోవిడ్-19 పాజిటివ్ ఉన్నప్పటికీ రూల్స్ ని బ్రేక్ చేసి షూటింగ్స్ ను కొనసాగించారు. విషయం తెలుసుకుని అధికారులు ఆమె ఇంటికి వెళ్లగా ఆమె కనీసం తలుపులు కూడా తెరవకుండా అధికారులకు చిరాకు తెప్పించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

నటిపై ఎఫ్ఐఆర్ నమోదు
ముంబై అధికారులు ఈ విధంగా వివరణ ఇచ్చారు. "నగర భద్రతపై రాజీ పడేది లేదు! కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన తరువాత కూడా ఒక నటి షూటింగ్ పాల్గొన్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలను పాటించనందుకు BMCకి చెందిన బాలీవుడ్ నటిపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. నియమాలు అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయి. అన్ని మార్గదర్శకాలను పాటించాలని, బాధ్యతగా ఉండాలని సహాయం చేయమని పౌరులను మేము కోరుతున్నాము ".. అని వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











