యువ హీరోయిన్‌కు పీకల్లోతు ఆర్థిక కష్టాలు.. నిర్మాతకు ఫోన్ చేస్తే.. కంటతడి పెట్టిన తార
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా సినీ కార్మికులే కాదు.. వర్థమాన సినీ తారల పరిస్థితి కూడా దయనీయంగా మారుతున్నది. గత రెండు నెలలుగా గృహ నిర్బంధంలో ఉంటున్న నటీనటులకు ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి. అలాంటి కష్టాలే బుల్లితర నటి సోనాల్ వెంగర్‌లేకర్‌ను చుట్టుముట్టాయి. ఇలాంటి సమయంలో తనకు రావాల్సిన రెమ్యునరేషన్ కోసం ప్రయత్నిస్తే చేదు అనుభవం ఎదురైంది. తనకు ఎదురైన ఓ సంఘటన గురించి సోనాల్ ఆవేదనను వ్యక్తం చేయడమే కాదు.. భావోద్వేగానికి కూడా గురయ్యారు. ఆమె చెప్పిన విషయాలు మీరే చూడండి..

సోషల్ మీడియా పోస్టుతో
తనకు ఎదురైన అనుభవాన్ని సోనాల్ సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా తెలియజేశారు. లాక్‌డౌన్ కారణంగా వచ్చే నెల ఖర్చులకు డబ్బులు కూడా లేవని నేను నా మేకప్ మ్యాన్‌కు చెప్పాను. అలాగే నాకు ఓ నిర్మాత నుంచి రావాల్సిన రెమ్యునరేషన్ గురించి కూడా ఆయనకు వివరించాను. చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాను. కానీ ఆయన తన పారితోషికాన్ని ఇవ్వడానికి ముఖం చాటేశారనే విషయాన్ని షేర్ చేసుకొన్నాను అని తన పోస్టులో సోనాల్ పేర్కొన్నారు.

మేకప్ మ్యాన్ స్పందించిన తీరుతో
ఈ క్రమంలో తన మేకప్ మ్యాన్ పంకజ్ గుప్తా స్పందించిన విషయాన్ని సోనాల్ వెల్లడించారు. నా వద్ద డబ్బులు లేవనే విషయాన్ని తెలుసుకొన్న మేకప్ మ్యాన్ తన భార్య గర్బవతిగా ఉన్న సమయంలో తన వద్ద ఉన్న డబ్బును నాకు ఇవ్వడానికి ముందుకొచ్చారు. తనకు ఎన్నో ఖర్చులు ఉన్నప్పటికీ తన వద్ద ఉన్న డబ్బు ఇవ్వజూపారు. ఆ ఘటనతో నేను చలించిపోయాను. నా కళ్ల వెంట కన్నీళ్లు కారాయి అని సోనాల్ చెప్పారు.

నిర్మాతకు ఫోన్ చేస్తే
తన మేకప్ మ్యాన్ తనకు ఫోన్ చేసి.. నా వద్ద 15 వేల రూపాయలు ఉన్నాయని, కావాలంటే మీరు తీసుకోండి. నా భార్య డెలివరీ సమయంలో మీరు తిరిగి ఇవ్వాలని సూచించారు. అయితే నాకు ఇవ్వాల్సిన డబ్బు కోసం నిర్మాతకు ఫోన్ చేస్తే ఫోన్ కాల్ ఎత్తకుండా ముఖం చాటేశాడు. లక్షల రూపాయాలు ఉన్న నిర్మాత నా ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేశాడు. కానీ నా మేకప్ మ్యాన్ తన వద్ద ఉన్న డబ్బును ఇవ్వడానికి ముందుకొచ్చారు. డబ్బు ఉండే మనుషులు, డబ్బులేని వారి తీరుకు అర్ధం చెప్పే సంఘటన ఇది అని సొనాల్ భావోద్వేగానికి గురయ్యారు.
Recommended Video

డబ్బు ఉంటే సంపన్నులం కాలేం..
నాకు డబ్బు ఇవ్వడమనేది గొప్ప విషయం కాదు. నా మేకప్ మ్యాన్ వద్ద డబ్బు లేకపోయినా ముందుకు రావడం గొప్ప విషయం. ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే సానుకూలంగా స్పందించడమే గొప్ప విషయం. నా దృష్టిలో వాళ్లే సంపన్నులు. డబ్బు ఉండి ముఖం చాటేసే వారు సంపన్నులు కాదు. మంచి మానవత్వాన్ని ప్రదర్శించడమే గొప్ప తనం అంటూ మీడియాతో సొనాల్ ఇటీవల అన్నారు.


Click it and Unblock the Notifications











