అండర్ వరల్డ్‌తో అలాంటి నష్టం.. మాఫియా గురించి సొనాలి బింద్రే సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌పై దావూద్, ఇతర మాఫియా డాన్ల ప్రభావం 90వ దశకంలో తీవ్రంగా ఉండేది. అయితే సినిమాలకు ఫైనాన్స్ చేయడం దగ్గర నుంచి మూవీలో నటీనటుల ఎంపిక కూడా వారి కనుసన్నల్లో జరిగేది. అయితే తమకు అనుకూలంగా ఉన్న హీరోల సినిమాలకు ఫైనాన్స్ చేయడం.. తమకు నచ్చిన హీరోయిన్ల ప్రమోట్ చేయడం లాంటి వ్యవహారాలు మాఫియా చెప్పుచేత్లులో ఉండేది. అయితే ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ భామ సోనాలి బింద్రే తాజాగా ఇచ్చిన మీడియాలో పలు సంచలన విషయాలను బయటపెట్టింది. ఆమె చెప్పిన వివరాలు, ఆమె వ్యక్తిగత జీవితం విషయంలోకి వెళితే..

క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకొని

క్యాన్సర్ వ్యాధి నుంచి కోలుకొని


కొద్ది సంవత్సరాల క్రితం క్యాన్సర్ బారిన పడిన సోనాలి బింద్రే ఆ ప్రాణాంతక వ్యాధి నుంచి కోలుకొని మళ్లీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇటీవల ఒక వెబ్ సిరీస్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరికొన్ని సినిమాల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలో సొనాలి బింద్రే యూట్యూబ్ ప్రాడ్‌కాస్ట్ ది రణ్‌వీర్ షోలో పాల్గొన్నది. ఈ సందర్భంగా 90వ దశకంలో బాలీవుడ్‌పై మాఫియా ప్రభావం గురించి వెల్లడించింది.

అండర్ వరల్డ్ ఫైనాన్స్ గురించి

అండర్ వరల్డ్ ఫైనాన్స్ గురించి


సొనాలి బింద్రే మాట్లాడుతూ.. బాలీవుడ్ సినిమాలకు అండర్ వరల్డ్ ఫైనాన్స్ చేసేది. వాళ్లు ప్రొడక్షన్ వ్యవహారాలను, నటీనటుల ఎంపిక కూడా వారి చేతుల్లో ఉండేది. ఒకప్పుడు వైట్ మనీతో సినిమాలు తీసేవారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో వారు మాఫియా ఫైనాన్స్ కోసం ప్రయత్నించేవారు. మాఫియా ప్రాబల్యం పెరిగిన తర్వాత బ్లాక్ మనీ విచ్చలవిడిగా సినిమా రంగంలోకి వచ్చింది అని సొనాలి బింద్రే తెలిపింది.

ఆఫర్లు అలా జారిపోయాయి అంటూ

ఆఫర్లు అలా జారిపోయాయి అంటూ


అండర్ వరల్డ్ నుంచి ఫైనాన్స్ తీసుకొనే నిర్మాతలతో నేను చాలా స్పష్టమైన వైఖరితో ఉండేదానిని. వారి నిబంధనలకు, ఒత్తిడికి గురికాకపోయేదానిని. ఆ కారణంగా, మాఫియా ఒత్తిడి కారణంగా చాలా సినిమాల్లో రోల్స్ చేతికి చిక్కినట్టే చిక్కి.. చేజారిపోయాయి. కొన్నిసార్లు సినిమాలో బుక్ అయిన తర్వాత.. వెంటనే కొందరు నిర్మాతలు నన్ను తప్పించి వేరే వాళ్లను తీసుకొన్న సందర్భాలు ఎక్కువ. ఆ సమయంలో తోటి నటీనటులు, దర్శకులు మా చేతుల్లో ఏమీ లేదని చేతులు ఎత్తేసే వారు అని సొనాలి బింద్రే తెలిపారు.

షారుక్ ఖాన్‌కు బెదిరింపులు

షారుక్ ఖాన్‌కు బెదిరింపులు


బాలీవుడ్‌లో అండర్ వరల్డ్ మాఫియా అరాచకాలపై చాలా మంది సినీ తారలు మాట్లాడటం తెలిసిందే. తాజాగా సొనాలి బింద్రే ఓపెన్ కావడం సంచలనం రేపింది. గతంలో షారుక్ ఖాన్‌కు అండర్ వరల్డ్ నుంచి ఎక్కువగా ఒత్తిడి ఉండేది. వారు ఆఫర్ చేసిన సినిమాల్లో నటించకపోతే తీవ్రస్థాయిలో బెదిరింపులు కూడా వచ్చేవనే విషయం తెలిసిందే.

సొనాలి బింద్రే కెరీర్ అలా

సొనాలి బింద్రే కెరీర్ అలా


సొనాలి బింద్రే కెరీర్ విషయానికి వస్తే.. 1994లో ఆగ్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. సర్ఫరోష్, హమ్ సాత్ సాత్ హై, దిల్ జలే, కల్ నా హో నా హో, తెలుగులో ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్, ఖడ్గం లాంటి చిత్రాల్లో నటించింది. తాజాగా ది బ్రోకెన్ న్యూస్ వెబ్ సిరీస్‌లో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X