మృత్యువును ఎదిరిస్తా.. సొనాలి బింద్రే.. ఆమెకు ఏ క్యాన్సర్ అంటే.. వైద్యుల క్లారిటీ!

By Rajababu

Recommended Video

Sonali Bendre Suffering With Metastasis Cancer

టాలీవుడ్, బాలీవుడ్‌ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న అందాల తార సొనాలి బింద్రేకు క్యాన్సర్ వ్యాధి సోకిందనే వార్త భారతీయ సినీ ప్రపంచాన్నే కాకుండా, అన్ని వర్గాలను షాక్ గురిచేసింది. క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడేందుకు ప్రస్తుతం సొనాలి బింద్రే అమెరికాలో చికిత్స పొందుతున్నారు. క్యాన్సర్ నుంచి త్వరగా కోలుకోవాలని సన్నిహితులు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

మెటాస్టాటిస్ క్యాన్సర్‌గా గుర్తింపు

మెటాస్టాటిస్ క్యాన్సర్‌గా గుర్తింపు

సొనాలి బింద్రేకు సోకిన వ్యాధిని మెటాస్టాటిస్ క్యాన్సర్‌గా గుర్తించారు. ఎక్కడైతే లేదా ఏ భాగం వద్ద క్యాన్సర్ కణాలు పుడుతాయో.. అక్కడి నుంచి ఇతర భాగాలకు అవి విస్తరిస్తాయి. తెల్ల రక్త కణాల్లో, రక్తంలో కలిసిపోయి రోగ నిరోధకశక్తిని నాశనం చేస్తాయి.

 సొనాలికి 4వ స్టేజ్‌లో క్యాన్సర్

సొనాలికి 4వ స్టేజ్‌లో క్యాన్సర్

సోనాలికి క్యాన్సర్ 4వ స్టేజ్‌లో ఉంది. ఈ దశ క్యాన్సర్ ఉన్నప్పుడు మెటాస్టాటిస్ ఏర్పడుతుంది. ఈ స్థాయి చాలా తీవ్రమైనది. ఈ దశలోనే క్యాన్సర్ వేగంగా విస్తరిస్తుంది. కాలేయం, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, ఎముకల్లో మెటాస్టాటిస్ ఏర్పడుతుంది అని వైద్యులు వెల్లడించారు.

 ఫ్యామిలీ థెరపీ అవసరం

ఫ్యామిలీ థెరపీ అవసరం

క్లిష్టమైన క్యాన్సర్ వ్యాధికి గురైనప్పుడు ఫ్యామిలీ థెరపీ చాలా అవసరం. వ్యాధిగ్రస్తులకు కుటుంబ సభ్యులు అండగా నిలిచి మనోధైర్యం నింపడం అనేది వేగంగా కోలుకోవడానికి ఉపయోగపడుతుంది. ట్రీట్మెంట్ సమయంలో వ్యాధి ఎలా మెరుగుపడుతుందనే విషయాన్ని వారికి చెప్పడం చాలా అవసరం అని వైద్యులు వెల్లడించారు.

ప్రేమను కురిపిస్తున్నందుకు

ప్రేమను కురిపిస్తున్నందుకు

క్లిష్టమైన సమయంలో అచంచలమైన ప్రేమను కురిపిస్తూ అండగా నిలుస్తున్న ప్రతీ ఒక్కరికి సొనాలి బింద్రే థ్యాంక్స్ చెబుతున్నారు. ఇటీవల అమెరికాలో సొనాలి బింద్రేను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కలిసి సంఘీభావం తెలిపారు.

న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్

న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్

క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకు తక్షణ చికిత్స అందించడమే అత్యవసరం. న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్ జరుగుతున్నది. క్యాన్సర్‌ను ఎదురించడానికి నా వంతుగా విశ్వప్రయత్నం చేస్తున్నాను. మానసికంగా ధృడంగా మారాను అని సొనాలి బింద్రే సోషల్ మీడియాలో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X