For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Sonam Kapoor Pregnant: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. భర్త మీద పడుకుని.. హాట్ ఫొటోను వదిలి!

  |

  మిగిలిన రంగాలతో పోల్చుకుంటే సినిమాల్లో వారసుల ఎంట్రీ ఎక్కువగా కనిపిస్తుంది. అది కూడా బాలీవుడ్‌లో ఇప్పటికే ఎంతో మంది స్టార్లు తమ పిల్లలను సినీ రంగానికి పరిచయం చేశారు. అయితే, అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. తండ్రి చాటు బిడ్డగానే సినిమాల్లోకి ప్రవేశించిన ఈ భామ.. ఆకట్టుకునే అందం, అద్భుతమైన యాక్టింగ్‌తో తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. తద్వారా వరుస సినిమాలతో హవా చూపించింది. ఈ నేపథ్యంలో తాజాగా సోనమ్ కపూర్ తన అభిమానులకు గుడ్ న్యూస్‌ను చెప్పింది. ఇంకెందుకు ఆలస్యం? అసలేం జరిగిందో మీరూ తెలుసుకోండి!

  అలా పరిచయమైన సోనమ్ కపూర్

  అలా పరిచయమైన సోనమ్ కపూర్

  అనిల్ కపూర్ కుమార్తెగా సోనమ్ కపూర్ 2007లోనే ‘సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇందులో గ్లామర్‌కు గ్లామర్.. యాక్టింగ్‌కు యాక్టింగ్ చూపించి మెస్మరైజ్ చేసింది. తద్వారా ఆరంభంలోనే మంచి పేరుతో పాటు ఫాలోయింగ్‌ను కూడా భారీగానే దక్కించుకుంది.

  Bigg Boss Non Stop: బిగ్ బాస్‌లో షాకింగ్ సీన్.. బట్టలు విప్పేసిన లేడీస్.. షోలో ఇదే తొలిసారి

  తక్కువ మూవీలు... ఎక్కువ పేరు

  తక్కువ మూవీలు... ఎక్కువ పేరు

  సోనమ్ కపూర్ చేసిన చిత్రాలు చాలా తక్కువే కానీ, ప్రేక్షకుల మన్ననలు బాగానే పొందింది. మరీ ముఖ్యంగా ‘నీర్జా' మూవీ ఆమె కెరీర్‌లోనే ఉత్తమ చిత్రంగా నిలిచింది. అంతేకాదు, ఈ సినిమాకు గానూ ఆమె ఎన్నో రకాల అవార్డులను దక్కించుకుంది. దీనితో పాటు ‘ప్రేమ్ రతన్ దన్ పాయో', ‘ఖూబ్‌సూరత్' సహా ఎన్నో చిత్రాల్లో అద్భుతమైన నటనతో అలరించింది.

  లవ్ మ్యారేజ్... కెరీర్‌ కొనసాగిస్తూ

  లవ్ మ్యారేజ్... కెరీర్‌ కొనసాగిస్తూ

  వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే సోనమ్ కపూర్.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. వివాహం తర్వాత తన పేరును సోనమ్ కపూర్ అహుజా అని మార్చుకుంది. గతంలో ఎంతో వేగంగా సినిమాలు చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. తద్వారా ఎంతో మంది ఆదర్శంగా నిలుస్తూ సాగిపోతోంది.

  బీచ్‌లో బికినీతో శ్రీయ శరణ్ అందాల విందు: తల్లైన తర్వాత తొలిసారి ఇంత దారుణంగా!

  అప్పటి నుంచి మూవీలకు గ్యాప్

  అప్పటి నుంచి మూవీలకు గ్యాప్

  సోనమ్ కపూర్ చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాలు చేస్తూనే వచ్చింది. అయితే, 2020లో వచ్చిన AK vs AK మూవీ తర్వాత ఆమె నటించిన మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘బ్లైండ్' అనే సినిమాలో నటించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఇది తప్ప ఆమె మరో సినిమాను ఒప్పుకోలేదు.

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

  సోనమ్ కపూర్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం వార్తల్లోనే ఉంటోంది.

  ఘోరమైన సెల్ఫీ షేర్ చేసిన చరణ్ హీరోయిన్: షర్ట్ విప్పేసి.. లోదుస్తులు కూడా లేకుండా!

  తల్లి కాబోతున్న బాలీవుడ్ భామ

  తల్లి కాబోతున్న బాలీవుడ్ భామ

  కొంత కాలంగా సోనమ్ కపూర్ వెండితెరపై పెద్దగా సందడి చేయడం లేదు. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అయిందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ స్టార్ డాటర్ సోషల్ మీడియా వేదికగా తన ప్రెగ్నెన్సీని కన్ఫార్మ్ చేసింది. ఇందుకోసం హాట్ డ్రెస్ ధరించి.. తన భర్త ఒడిలో పడుకున్న ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

  Recommended Video

  Sonam Kapoor, Anand Ahuja Set Couple Goals As They Returned From Vacation || Filmibeat Telugu
  నీకు వెల్‌కం చెప్పేందుకు రెడీ

  నీకు వెల్‌కం చెప్పేందుకు రెడీ

  గర్భంతో ఉన్న ఫొటోలు షేర్ చేసిన సోనమ్ కపూర్.. తన బేబీ కోసం ‘నాలుగు చేతులు.. నిన్ను ఉత్తమంగా పెంచడానికి మేం చేయగలిగిందంతా చేస్తాం. రెండు హృదయాలు. నీ గుండె చప్పుడుతో అడుగడుగునా కలిసే ఉంటుంది. ఒక కుటుంబంగా నీకు ఎల్లప్పుడూ మా ప్రేమ, మద్దతు అందిస్తాం. నీకు వెల్‌కం చెప్పేందుకు ఇంక వేచి చూడలేం' అంటూ రాసుకొచ్చింది.

  English summary
  Bollywood Actress Sonam Kapoor Ahuja is Very Busy In Social Media. Now She Announced her Pregnancy Via Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X