పబ్లిక్‌లో హీరోయిన్‌కు అవమానం: ప్రైవేట్ పార్టులను నొక్కిన వ్యక్తి.. ఏడుస్తూ పరుగులు
బాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్లు తమ వారసులను సినిమాల్లోకి పరిచయం చేశారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుకున్నారు. అలాంటి వారిలో అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ ఒకరు. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చిన ఈ భామ.. అందం, అభినయంతో రాణించి స్టార్‌గా ఎదిగింది. అయితే, వివాహం చేసుకుని తల్లవడంతో ఇప్పుడు గ్యాప్ తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా సోనమ్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన జీవితంలో జరిగిన ఓ చేదు సంఘటన గురించి చెప్పింది. ఆ వివరాలు మీకోసమే!
అలా పరిచయం.. స్టార్‌గా: అనిల్ కపూర్ కుమార్తెగా ప్రపంచానికి పరిచయమైన సోనమ్ కపూర్.. 2007లో వచ్చిన 'సవారియా' అనే చిత్రంతో హీరోయిన్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో అద్భుతమైన నటన, హావభావాలను కనబరిచి ప్రేక్షకులను మెప్పించింది. దీనికితోడు ఈ చిత్రం భారీ హిట్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా సోనమ్ కపూర్‌కు ఆదిలోనే బాలీవుడ్‌లో స్టార్‌గా మారిపోయింది.

పెళ్లి తర్వాతా కంటిన్యూ: హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత ఆరంభంలోనే సోనమ్ ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. దీంతో స్టార్‌గా ఎదిగిపోయి వరుస చిత్రాలతో ఫామ్‌లో కొనసాగింది. ఆ సమయంలోనే ఈ బ్యూటీ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ అహూజాను పెళ్లాడింది. అయితే, చాలా మంది హీరోయిన్లలా కాకుండా సోనమ్ కపూర్ వివాహం తర్వాత కెరీర్‌ను మాత్రం కొనసాగిస్తూ మజాను పంచింది.

తల్లైన హీరోయిన్.. బ్రేక్: బాలీవుడ్‌లో తనదైన చిత్రాలు చేస్తూ వచ్చిన సోనమ్ కపూర్.. పెళ్లైన తర్వాత కొంత కాలానికే గర్భవతి అయింది. ఈ క్రమంలోనే ఆగస్టు 20, 2022న సోనమ్ పండంటి మగ బిడ్డకు తల్లైంది. అప్పటి నుంచి తన కుమారుడితోనే సోనమ్ మదర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీంతో దాదాపు రెండేళ్ల నుంచి ఆమె సినిమాలకు గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఫ్యాన్స్ డీలా పడిపోయారు.
రీఎంట్రీ కోసం సిద్ధంగా: సోనమ్ కపూర్ 2020లో వచ్చిన 'AK vs AK' సినిమాలోనే నటించింది. దీని తర్వాత ఆమె 'బ్లైండ్' అనే చిత్రంలో కూడా చేసింది. కానీ, ఇది ఇంకా రిలీజ్ అవలేదు. ఇక, తల్లైన తర్వాత గ్యాప్ తీసుకున్న ఈ భామ.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నద్ధం అవుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడిప్పుడే ముఖానికి మేకప్ వేసుకోవడంతో పాటు చర్చలు కూడా జరుపుతోంది.

సోనమ్‌కు అవమానం: సినిమాల్లోకి ఎంటరైన తర్వాత నుంచి వరుసగా మూవీలు చేసి.. తల్లైన తర్వాత తెరకు దూరంగా ఉంటోన్న సోనమ్ కపూర్ తాజాగా ఓ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంది. అదే సమయంలో తన జీవితంలో జరిగిన ఓ చేదు సంఘటన గురించి కూడా రివీల్ చేసేసింది.

అక్కడ టచ్ చేశాడని: ఈ ఇంటర్వ్యూలో సోనమ్ కపూర్ మాట్లాడుతూ... 'నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్లాను. ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చాను. అప్పుడు ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అంతేకాదు, వెనుక నుంచి నన్ను గట్టిగా పట్టుకుని నలిపేశాడు. ఆ తర్వాత నా ఎద భాగంపై చేతులు వేసి నొక్కాడు' అని చెప్పుకొచ్చింది.
ఏడుస్తూ పరుగు పెట్టి: ఆ తర్వాత సోనమ్ కపూర్ కంటిన్యూ చేస్తూ.. 'ఆ సంఘటన తర్వాత నేను ఏం జరుగుతుందో తెలియక షాక్‌కు గురయ్యాను. గుక్కపెట్టి ఏడుస్తూ అక్కడి నుంచి పరిగెత్తాను. దీని నుంచి కోలుకోడానికి నాకు చాలా సమయం పట్టింది. ఇలా ఎంతో మంది అమ్మాయిలు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు' అంటూ వివరించింది. ఇప్పుడీ కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











