Sridevi Death Anniversary: వైరల్ అవుతున్న శ్రీదేవి ఆఖరి ఫొటో.. మరణానికి ముందు ఇలా.. ఎమోషనల్!

అతిలోకసుందరిగా బ్యూటిఫుల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న శ్రీదేవి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో అభిమానించేవారు. వర్క్ చేసిన ప్రతి ఇండస్ట్రీలో కూడా నటిగా అయితే మంచి గుర్తింపు అందుకున్నారు. అయితే శ్రీదేవి మరణించి నేటికి ఐదు సంవత్సరాలు కావస్తోంది. ఇక ఆమె డెత్ యానివర్సరీ సందర్భంగా చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గుర్తు చేసుకుంటూ ఆమెకు నివాళులర్పిస్తున్నారు.

ఇక ఆమె భర్త బోణీ కపూర్ ప్రత్యేకంగా శ్రీదేవి కి సంబంధించిన రెండు ముఖ్యమైన ఫోటోలను షేర్ చేసుకున్నాడు. మెయిన్ గా ఆమె చివరిగా ఫ్యామిలీతో దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వివరాలలోకి వెళితే..

అన్ని రకాల సినిమాలు చేసి

అన్ని రకాల సినిమాలు చేసి

ఇండియన్ సినిమా హిస్టరీలో మంచి గుర్తింపును అందుకున్న ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నారు. అయితే ప్రేక్షకుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేవారు మాత్రం కొందరే ఉంటారు. అలాంటి హీరోయిన్స్ శ్రీదేవి ఒకరు. మొదటి నుంచి కూడా డిఫరెంట్ సినిమాలు కమర్షియల్ సినిమాలు అని తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆమె ఎంతగానో ఆకట్టుకున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి..

చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి..

శ్రీదేవి ఎలాంటి పాత్ర చేసినా కూడా అందులో ఎంతో ఒదిగిపోయి నటించేది. అంతేకాకుండా చాలా వరకు తన పాత్రలకు తనే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకునేది. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సీనియర్ ఆర్టిస్టుగా ఆమె చేసిన 300 సినిమాలు కూడా ప్రేక్షకులను ఏదో ఒక యాంగిల్ లో మాత్రం ఎమోషనల్ గా టచ్ చేసినవే. రొమాన్స్ ఐనా ఎమోషనల్ సీన్స్ అయినా అలాగే సీరియస్ సీన్స్ అయినా ఆమె చాలా లీనమైపోయి నటించేది.

అతిలోకసుందరి

అతిలోకసుందరి

దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించిన శ్రీదేవి హిందీలోసద్మా, చాల్‌బాజ్, ఖుదా గవా, నగీనా, చాందిని, జుదాయి అనే సినిమాలతో తన స్టార్ ఇమేజ్ ని పెంచుకున్నారు. ఇక తెలుగులో అయితే అలాంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో చేసినటువంటి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ ఒక్క సినిమాతోనే ఆమె తెలుగు వారికి మర్చిపోలేని విధంగా గుర్తులు మిగిల్చింది.

 శ్రీదేవి 5వ వర్దంతి

శ్రీదేవి 5వ వర్దంతి

ఇక శ్రీదేవి మరణించి నేటికి 5 ఏళ్ళు అయింది. దుబాయిలో ఆమె మోహిత్ మార్వా వివాహ వేడుక కోసం వెళ్ళిన విషయం తెలిసిందే. 2018 ఫిబ్రవరి 24వ తేదీన ఆమె హోటల్లో ఒక బాత్ టబ్ లో మునిగిపోయి చనిపోయింది అని తెలియజేశారు. అయితే ఇంకా ఆ మరణం పై అనేక రకాల అనుమానాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. శ్రీదేవి మరణం కూడా ఒక సస్పెన్స్ లాగానే మిగిలిపోయింది.

శ్రీదేవితో మొదటి ఫొటో

శ్రీదేవితో మొదటి ఫొటో

ఇక శ్రీదేవి కి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె భర్త బోనీ కపూర్ ఆమె మొదటి ఫోటోను అలాగే చివరి ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా శ్రీదేవితో మొదటి సినిమా నిర్మించినప్పుడు బోనికపూర్ ఒక ఫోటో కూడా దిగాడు. ఆ ఫోటోలో ఇద్దరు నవ్వుతూ కనిపించారు.

 ఆఖరి ఫొటో వైరల్

ఆఖరి ఫొటో వైరల్

ఇక శ్రీదేవి ఆఖరి ఫోటోను కూడా బోనీ కపూర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. దుబాయ్ పెళ్లిలో కుటుంబ సభ్యులందరు కూడా నవ్వుతూ ఉండగా ఆమె కూడా గ్రూప్ ఫోటోకు స్టిల్ ఇచ్చారు. ఇక ఫోటోలో ఖుషి కపూర్ కూడా ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది.

ఇక ఆ పార్టీలో శ్రీదేవి కాస్త ఎక్కువగా మద్యం తీసుకోవడం వలన మత్తులోకి జారుకుందిని, ఇక తర్వాత రూమ్ లోకి వచ్చాక బాత్రూంలోకి వెళ్లడంతో అక్కడే ఆమె బాత్ టబ్ లో పడిపోయిందని.. ఆ కారణంగానే ఆమె చనిపోయింది అని.. అప్పుడు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X