తాప్సీకి చేదు అనుభవం.. మళ్లీ మళ్లీ ఫిర్యాదు చేయనని స్పష్టీకరణ
సినీ తార తాప్సీ పన్నుకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తున్న సినిమా కోసం తాప్సీ ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించింది. అయితే ప్రయాణంలో ఎయిర్ ఇండియా సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తనకు ఇబ్బంది కలిగించిన సిబ్బందిపై ఆగ్రహం చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సినీ నటి తాప్సీ.. ఎయిర్ ఇండియా సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల హాలీడే వెకేషన్ కోసం ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది తీరుతో ఆమెకు అసౌకర్యం కలిగింది. దీంతో ఆమె ఎయిర్ ఇండియా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

జాలీగా గడుపుదామని అనుకొన్న వెకేషన్‌ను ఎయిర్ ఇండియా రచ్చ చేసింది. అది ఎంత దుర్భరమైన ప్రయాణమో మీరు అనుభవిస్తే తప్ప తెలియదు అని తాప్సీ ట్వీట్ చేసింది. తాప్సీ పన్ను ట్వీట్‌పై ఎయిర్ ఇండియా అధికారులు స్పందించారు. మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాను. మీకు కలిగిన ఇబ్బందేమిటో చెబితే మేము సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకొంటాం అని అధికారులు కోరారు.
అధికారుల స్పందనపై తాప్సీ పన్ను రియాక్ట్ అవుతూ.. మీరే దయచేసి సంబంధిత సిబ్బందిని చెక్ చేసుకొండి. అప్పుడేఏ జరిగిందో మీకు తెలుస్తుంది. ఈ విషయంపై మళ్లీ మళ్లీ ఫిర్యాదు చేసే ఓపిక నాకు లేదు అని తాప్సీ పన్ను జవాబు ఇచ్చింది.
బాలీవుడ్‌లో తాప్సీ పన్ను వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల అమితాబ్‌తో కలిసి ఆమె నటించిన బద్లా చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ప్రస్తుతం భూమి పడ్నేకర్‌తో కలిసి ఆమె సాండ్ కీ ఆంఖ్ చిత్రంలో నటిస్తున్నది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి స్పందనను అందుకొంటున్నది.


Click it and Unblock the Notifications











