»   » సెక్సీ హీరోయిన్‌కు ఆ వ్యాధి, అందుకే లావైపోతోంది..దుమ్ము దులిపిందిగా!

సెక్సీ హీరోయిన్‌కు ఆ వ్యాధి, అందుకే లావైపోతోంది..దుమ్ము దులిపిందిగా!

Subscribe to Filmibeat Telugu

సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు ట్రోలింగ్ కి గురి కావడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. ప్రతి సెలెబ్రిటీని పనికట్టుకుని విమర్శించేవారు సోషల్ మీడియాలో ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువగా ఈ ట్రోలింగ్ బారిన పడుతుంటారు. తాజాగా మరాఠి హీరోయిన్, టెలివిజన్ నటి అయిన తేజస్విని పండిట్ సోషల్ మీడియాలో విమర్శకుల బారీన పడింది. ఈ విషయాన్ని ఉమెన్స్ డే సందర్భంగా తేజస్విని తెలిపింది. అంతే కాదు తనని విమర్శించిన వారి దుమ్ము దులిపింది కూడా.

 బుల్లి తెరపై క్రేజ్

బుల్లి తెరపై క్రేజ్

తేజస్విని పండిట్ బుల్లి తేర సీరియల్స్ తో పాపులర్ అయింది. ప్రస్తుతం మరాఠి చిత్రాలలో కూడా నటిస్తోంది. ఈ సెక్సీ భామకు ఇంస్టాగ్రామ్ లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్

సోషల్ మీడియాలో ట్రోలింగ్

ఇటీవల తేజస్విని బొద్దుగా మారుతోంది. రోజురోజుకు తేజస్విని లావైపోతుండడంతో నెటిజన్లు ఆమెకు అసభ్యంగా కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు. అసభ్యకర కామెంట్స్ తో తేజస్విని మనస్తాపానికి గురైంది.

దుమ్ము దులిపింది

దుమ్ము దులిపింది

ఈ కామెంట్స్ ని పట్టించుకోకూడదని నిర్ణయించుకుందట. కానీ ఉమెన్స్ డే రోజు సందర్భంగా విమర్శకుల ఘాటు సమాధానం ఇచ్చింది. అవును నేను ఇటీవల కాస్త లావు అయ్యాను. అయితే ఇప్పుడు ఏంటి అంటూ ఘాటుగా స్పందించింది. మహిళలని గౌరవించడం నేర్చుకోండి అంటూ కౌంటర్ ఇచ్చింది.

 ఆ వ్యాధి ఉంది.. అందుకే

ఆ వ్యాధి ఉంది.. అందుకే

తనకు థైరాయిడ్ సమస్య ఉందని అందుకే ఈ మధ్య లావుగా మారానని తేజస్విని తెలిపింది. ఈ విషయాలు తెలియకుండా విమర్శలు చేయడం ఎంతవరకు సబబు. ఒకవేళ నిజంగానే లావైనా మీకు సమస్య ఏంటి అంటూ చురకలటించింది.

బాడీ షేమింగ్ ఆపాలి

బాడీ షేమింగ్ ఆపాలి

సోషల్ మీడియా వేదికగా బాడీ షేమింగ్ కు పాల్పడడం ఆపాలని తేజస్విని పండిట్ కోరింది. నటులు ఇలాగె ఉండాలని ఇక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించింది. అందరు నటులు ఎప్పుడూ ఒకేలా ఉండలేరనే సత్యాన్ని గ్రహించాలని కోరింది.

English summary
Actress Tejaswini shuts up trolls with strong post on body shaming. She is suffering from that disease.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu