Don't Miss!
- News
Budget 2023: ధరలు తగ్గే- పెరిగే వస్తువులు ఇవే: వారికి బిగ్ షాక్..!!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Lifestyle
షుగర్ పేషంట్స్ ఉదయాన్నే ఈ ఆహారాలను తినకూడదు.. తింటే షుగర్ లెవల్స్ పెరిగి, ప్రాణాలకే ప్రమాదం...
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Urfi Javed: మరో వింత డ్రెస్ లో షాక్ ఇచ్చిన ఉర్ఫీ.. సగం సగం డ్రెస్ లో శాంటా అంటూ..
ఇటీవల కాలంలో పెద్దగా సినిమాలు చేయకపోయినా కూడా కొంతమంది మోడల్స్ కు మంచి క్రేజ్ అందుతోంది. సోషల్ మీడియా వలన వారి గ్లామర్ తోనే ఎక్కువ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంపాదించుకుంటున్నారు. ఇక ఆ తరహాలో బిగ్ బాస్ ద్వారా ఫోకస్ అయినటువంటి ఉర్ఫీ జావేద్ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమె కొన్ని ట్రోల్ కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. రీసెంట్ గా అమ్మడు మరో వింత డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ తో ఫోకస్
ఉర్ఫీ జావేద్ సోషల్ మీడియా జనాలకు తెలియని పేరు ఏమి కాదు. ఎక్కువ సినిమాల్లో నటించకపోయినప్పటికీ కూడా ఓవర్గం వారిని మాత్రం తన గ్లామర్ తో ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. బిగ్ బాస్ ఓటీటీ మొదటి సీజన్లో పాల్గొన్నప్పుడు మొదట్లోనే ఆమె వైరల్ అయింది. అయితే ఆ హౌస్ లో మాత్రం ఆమె ఎక్కువ కాలం కొనసాగలేదు. వచ్చిన మొదటి వారంలోనే వెనక్కి వెళ్లిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్
అయితే బిగ్ బాస్ లో నుంచి ఆమె తొందరగా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ తర్వాత సోషల్ మీడియా లో తన గ్లామరస్ అందాలతో ఎంతగానో ఆకర్షిస్తూ క్రేజ్ అందుకుంది. ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చేసిన కూడా ఈజీగా వైరల్ అవుతూ ఉంటాయి. నెగిటివ్ కామెంట్స్ ట్రోల్స్ ఎంత వచ్చినప్పటికీ కూడా అవేమి పెద్దగా పట్టించుకోకుండా ఎప్పటిలానే తన ఫోటోషూట్స్ కొనసాగిస్తుంది.

గ్లామరస్ ఫొటోషూట్స్
ఉర్ఫీ జావేద్ ఏదైనా డ్రస్ వేసింది అంటే ఇంతకుముందు అది ఎవరు వేయని విధంగానే ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి డ్రెస్ లో లో కూడా ఆమె తన గ్లామర్ కూడా హైలెట్ అయ్యేలా స్టిల్స్ ఇస్తుంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలలో ఎక్కువగా బికినీ తరహా అందాలు వైరల్ అవుతూ ఉంటాయి. అనేకసార్లు అర్థనకంగా కూడా కనిపించింది.

క్రిస్మస్ స్పెషల్ కాస్ట్యూమ్
అయితే ఉర్ఫీ జవేద్ అప్పుడప్పుడు మూమెంట్ చూసి కూడా వింత డ్రెస్ లలో కనిపిస్తూ ఉంటుంది. ఇక క్రిస్మస్ ఫెస్టివల్ స్పెషల్ అంటూ బ్యూటిఫుల్ క్రిస్మస్ శాంటా అని తనకు తానే ప్రచారం చేసుకుంటుంది. ఇక అందులోనే రెడ్ కలర్ డ్రెస్ లో ఒకవైపు నడుము అందాలను మరోవైపు లెగ్స్ అందాలను హైలెట్ చేసే ప్రయత్నం చేసింది. ఈ గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెరుగుతున్న ఫాలోవర్స్
ఉర్ఫీ జవేద్ ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా వైరల్ అవ్వాల్సిందే అని మరోసారి రుజువు చేసింది. ఇక అమ్మడు సోషల్ మీడియాలో తన ఫ్యాన్ ఫాలోవర్స్ మెల్లమెల్లగా పెంచుకుంటోంది. ముఖ్యంగా తన ఇన్స్టాగ్రామ్ లోనే ఇటీవల భారీ స్థాయిలో ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. మొత్తంగా ఇన్ స్టాలో అయితే ఇప్పుడు 4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఈ తరహా గ్లామర్ షోతో అమ్మడు ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.