»   » హాట్ హీరోయిన్ ఫేక్ ఆధార్ కార్డుతో హోటల్‌ రూమ్ బుకింగ్, ఫిర్యాదు!

హాట్ హీరోయిన్ ఫేక్ ఆధార్ కార్డుతో హోటల్‌ రూమ్ బుకింగ్, ఫిర్యాదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ 'హేట్ స్టోరీ 4'లో హాట్ అండ్ సెక్సీ అందాల ప్రదర్శనతో అలరించిన ఊర్వశీ రౌటేలా ముంబై పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో ఉన్న ఫేక్ ఆధార్ కార్డును ఉపయోగించి గుర్తు తెలియని వ్యక్తులు బంద్రాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో రూమ్ బుక్ చేయడమే ఇందుకు కారణం.

ఇటీవల సదరు ఫైవ్ స్టార్ హోటల్‌లో జరిగిన ఓ ఈవెంటుకు ఊర్వశి హాజరయ్యారు. ఈ సందర్భంగా హోటల్ ఎంప్లాయ్ ఒకరు మీ పేరు మీద రూమ్ బుక్ అయి ఉందనే విషయం ఆమె దృష్టికి తేవడంతో కంగారుపడ్డ ఆమె వెంటనే బుకింగ్ డీటేల్స్ చెక్ చేసింది. తన ఫేరుతో ఉన్న ఫేక్ ఆధార్ కార్డుతో ఆన్ లైన్లో ఈ బుకింగ్ జరిగినట్లు గుర్తించిన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Actress Urvashi Rautelas fake Aadhaar card used to book hotel room

ఊర్వశి ఫిర్యాదుతో ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 420(చీటింగ్) కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆన్ లైన్లో రూమ్ బుక్ చేసిన ఐపీ అడ్రస్ ఆధారంగా ఈ చర్యకు పాల్పడింది ఎవరు అనే దానిపై విచారణ జరుపుతున్నారు.

ఈ విషయమై ఊర్వశి మీడియాతో మాట్లాడుతూ... తానుగానీ, తన సెక్యూరిటీ సిబ్బంది కానీ ఎవరూ హోటల్‌లో రూమ్ బుక్ చేయలేదని, తన పేరు, ఫోటోగ్రాఫ్ ఉపయోగించి ఇదంతా చేశారని, ప్రూఫ్‌గా తన పేరుతో ఆధార్ కార్డు క్రియేట్ చేశారని, సదరు ఆధార్ ఐడీ తనది కాదని ఊర్వశి తెలిపారు.

English summary
Urvashi Rautela, who was last seen in thriller film Hate Story 4, has approached Mumbai Police after she found that a fake Aadhaar card was used to book a room in her name at a five-star hotel in Bandra. According to Mumbai Mirror, the actress was attending an event at the hotel, and later one of the staff informed her about this issue.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X