Rajkundra Modus Operandi : రొజుకు 70 వేలు, అరెస్ట్ అయ్యేదాకా తెలియదు, సీక్రెట్స్ బయటపెట్టిన హాట్‌షాట్‌ నటి!

హాట్‌ హిట్స్ మరియు ఇతర వెబ్‌సైట్ల కోసం చాలా బోల్డ్ ఫిల్మ్‌లలో పనిచేసిన జోయా రాథోడ్ రాజ్ కుంద్రా టీం నుంచి వచ్చిన ఆఫర్స్ గురించి ఒక నేషనల్ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ పలు కీలక వివరాలు వెల్లడించారు. ఆమె హాట్ షాట్ యాప్ లో కూడా కొన్ని వీడియోలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

నా వెంట పడేవారు..

నా వెంట పడేవారు..

హాట్‌షాట్‌ యాప్ కోసం కొన్ని అడల్ట్ వీడియోలలో పనిచేయడానికి రాజ్ కుంద్రా యొక్క పర్సనల్ అసిస్టెంట్ ఉమేష్ కామత్ జోయాను చాలాసార్లు ఒప్పించడానికి చూశారని జోయా పేర్కొన్నారు. ఫిబ్రవరిలో ఉమేష్ కామత్ అరెస్టు కావడానికి రెండు రోజుల ముందు కూడా ఉమేష్ కామత్ జోయా రాథోడ్‌ను పని చేయడానికి ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నాడని వెల్లడించింది. ఒక కార్యాలయంలో కలవడానికి బదులు ఉమేష్ కామత్ తనను వాట్సాప్ కాల్ ద్వారా నగ్నంగా ఆడిషన్‌ ఇవ్వమన్నాడని జోయా పేర్కొంది. ఆమె ముంబైకి దూరంగా ఉందా అంటే అలా ఏమీ లేదని వెల్లడించింది.

వాట్సాప్ లోనే న్యూడ్ ఆడిషన్

వాట్సాప్ లోనే న్యూడ్ ఆడిషన్

ఉమేష్ కామత్ తనని పదేపదే పని ఆఫర్లతో వెంటపడేవాడని జోయా పేర్కొంది. స్క్రిప్ట్ తెలియకుండానే వాట్సాప్ కాల్‌లో నగ్నంగా ఆడిషన్ చేయడానికి తాను నిరాకరించానని వెల్లడించింది. ఇక బోల్డ్ సన్నివేశాలు చేయాలని చెబుతూ ఫిబ్రవరిలో అరెస్టు కావడానికి రెండు రోజుల ముందు రోజుకు రూ.20 వేల చొప్పున పే చేస్తామని వెల్లడించింది. ఇక 'రాయ్' అనే వ్యక్తి (అసలు పేరు కాకపోవచ్చు) హాట్‌షాట్‌ కోసం కూడా పనిచేశాడని, అతని ఫోన్ కాల్స్ కూడా తనకు తరచూ వచ్చేవని జోయా పేర్కొన్నారు.

అంతర్జాతీయంగా నగ్న వెబ్ సిరీస్‌

అంతర్జాతీయంగా నగ్న వెబ్ సిరీస్‌

హాట్‌షాట్‌ అనే యాప్ యుకెకు చెందినదని దాని కోసం అంతర్జాతీయంగా నగ్న వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్నానని, ఇది పూర్తిగా నగ్నంగా ఉంటుందని, అందుకే ఆమె రోజుకు 70,000 రూపాయల వరకు పే చేస్తామని ముందే వెల్లడించారని ఆమె పేర్కొంది. అయుతే జోయా నిరాకరించడంతో, రాయ్ మాట్లాడుతూ, తాను ఇప్పటికే బోల్డ్ సినిమాలు చేస్తున్నానని, కాబట్టి ఆమె నగ్న వెబ్ సిరీస్‌లో పనిచేస్తే తరువాతి కాలంలో మంచి ఆఫర్స్ ఇస్తానని వెల్లడించాడని పేర్కొంది.

అప్పుడే డౌట్ వచ్చింది

అప్పుడే డౌట్ వచ్చింది


అయితే అంతర్జాతీయంగా ఇంగ్లీషులో చేసిన నగ్న వీడియోలు / వెబ్ షోలకు సంబంధించిన మొత్తం సెటప్ సింగపూర్‌లో ఉంది. కానీ ఇదంతా ముంబైలో జరుగుతుంటే అప్పుడే డౌట్ వచ్చిందని ఆమె పేర్కొంది. అయితే తాను నుఫ్లిక్స్ యాప్ కోసం యష్ ఠాకూర్‌తో కలిసి పనిచేశానని జోయా వెల్లడించారు. 2017లో తన నటనా కెరీర్ కి విరామం తీసుకున్న తర్వాత, జోయా 2020లో యష్ ఠాకూర్ చేసిన ఈ బోల్డ్ ఫిలిం ద్వారా వెలుగులోకి వచ్చారు.

Recommended Video

Anurag's Prank On Shilpa Shetty And Raj Kundra || Filmibeat Telugu
నాకు అప్పుడు తెలియదు

నాకు అప్పుడు తెలియదు

యష్ ఠాకూర్ కి రాజ్ కుంద్రాతో సంబంధం ఉన్నట్లు తనకు అప్పటికి తెలియదని, రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన తర్వాతే ఉమేష్ కామత్ రాజ్ కుంద్రా కోసం పనిచేసేవాడని తనకి తెలిసిందని పేర్కొంది. జోయా అంతకుముందు బడే ఆచే లగ్తే హై సీరియల్, సౌభాగ్యవతి భవ మరియు ఫియర్ ఫైల్స్ వంటి షోలలో పనిచేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X