twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుశాంత్ డెత్: రియా రియాలిటీ త్వరలోనే బయటపడుతుంది, కంగనా ఎక్స్ షాకింగ్ కామెంట్స్

    |

    ప్రస్తుతం సుశాంత్ సూసైడ్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఒక వైపు బీహార్ పోలీసులు మరోవైపు ముంబై పోలీసులు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే ముందు నుంచి ఈ కేసును డీల్ చేస్తున్న ముంబై పోలీసుల కంటే కూడా బీహార్ పోలీసులే ఎక్కువ సమాచారాన్ని కీలక విషయాలను కనుగొన్నట్లు తెలుస్తోంది. దీంతో రియా చక్రవర్తిలో భయం కూడా పెరిగినట్లు టాక్ వస్తోంది. ఆమె కేసు నుంచి బయటపడడానికి టాప్ మోస్ట్ క్రిమినల్ లాయర్ ని కూడా సెట్ చేసుకుంది.

    రియా రియాలిటీ బయటపడుతుంది

    రియా రియాలిటీ బయటపడుతుంది

    అయితే ఈ సమయంలో కంగానా మాజీ బాయ్ ఫ్రెండ్, యువ హీరో అధ్యాయన్ రియాపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. రియా రియాలిటీ వీలైనంత త్వరగా బయటపడుతుంది అంటూ అతను సోషల్ మీడియాలో స్పందించిన తీరు సరికొత్త కాంట్రవర్సీకి దారి తీస్తోంది. సుశాంత్ సూసైడ్ చేసుకున్నప్పటికి నుంచి కూడా అధ్యాయన్ రెగ్యులర్ గా ఈ కేసుపై ఎదో ఒక విదంగా స్పందిస్తున్నారు.

     నిజం ఎప్పటికైనా బయపడాల్సిందే

    నిజం ఎప్పటికైనా బయపడాల్సిందే

    అధ్యాయన్ మరెవరో కాదు. బాలీవుడ్ సీనియర్ నటుడు దర్శకుడు శేఖర్ సుమన్ తనయుడు. కంగనాతో అప్పట్లో ఈ యువ హీరో ప్రేమను కూడా కొనసాగించాడు. అయితే ఇప్పుడు అధ్యాయన్ సుశాంత్ సూసైడ్ పై స్పందిస్తూ తన గత చేదు అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటున్నాడు. నిజం ఎప్పటికైనా బయపడాల్సిందే అంటూ రియపై ఆరోపణలు చేస్తున్నాడు.

    సుశాంత్ రియా ట్విస్ట్

    సుశాంత్ రియా ట్విస్ట్

    అధ్యాయన్ ఈ విధంగా ట్వీట్ చేశాడు.. రియా చక్రవర్తి రియాలిటీ త్వరలోనే బయటపడుతుంది. నువ్వు పరిగెత్తవచ్చు కానీ చివరికి అలిసిపోయి ఆగిపోక తప్పదు. సుశాంత్ నిజం తెలియాలి. సుశాంత్ రియా ట్విస్ట్ నిరూపితం కావాలి. ఇది ఎంత భయంకరంగా ఉందొ నేను అర్థం చేసుకోగలను. మనం తప్పుడు వ్యక్తులాతో ఇన్వాల్వ్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది' అని అధ్యాయన్ తెలిపాడు.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది

    జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది

    అలాగే తన గత పరిస్థితి గురించి స్పందించిన అధ్యాయన్.. నన్ను నమ్మండి నా గత జీవితంలోకి నేను వెళ్లాలని నేను అనుకోవడం లేదు. కొందరి వల్ల అది సాధ్యం కాదు కూడా. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధ్యాయన్ వివరణ ఇవ్వడంతో సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ అవుతోంది.

    English summary
    Rhea Chakraborty your 'rheality' will be out soon, Sushant Singh Rajput case: MP Manoj Tiwari rises voice for CBI investigation. He tweeted that, I request with folded hands to give justice to Sushant who died 43 days ago, but no FIR has been registered so far. In this situation, A video of Sushant Singh Rajput's Bed room goes viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X