చేతబడి చేయించింది.. విడిపోయాక సంతోషంగా ఉన్నా.. కంగనాపై మాజీ ప్రియుడి కామెంట్స్

బాలీవుడ్‌లో ఉన్నన్ని ప్రేమ కహానీలు మరెక్కడా కనిపించవు. ఎంత త్వరగా ప్రేమలో పడతారో.. అంత త్వరగా బ్రేకప్ చెప్పేసుకుంటారు. ఓ వ్యవహారం ముగిశాక మరో కథకు తెరదీస్తారు. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ లవ్ స్టోరీలు బీ టౌన్‌లో ఎంతగా పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ప్రేమకు, తిట్ల దండకానికి అధ్యాయన్‌ సుమన్‌, హృతిక్ రోషన్ బలైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా కంగనా, అధ్యాయన్ సుమన్ వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది.

రంగోలీ లేపిన దుమారం..

రంగోలీ లేపిన దుమారం..

ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌ ఘటనపై రంగోలీ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపిన సంగతి తెలిసిందే. కరోనాతో మృతి చెందిన ఓ జమాతీ కుటుంబానికి వైద్య పరీక్షలు చేయటానికి వెళ్లిన డాక్టర్లు, పోలీసులపై దాడి చేయడంపై రంగోలీ స్పందించింది. ఓ వర్గానికి చెందిన వారిని, సెక్యులర్‌ మీడియాను వరుసగా నిలబెట్టి కాల్చిపడేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె ట్విట్టర్ ఖాతాను తొలిగించారు. ఈ నేపధ్యంలో సోదరికి అండగా.. కంగనా నిలబడింది.

ఘటనపై భిన్నస్వరాలు..

ఘటనపై భిన్నస్వరాలు..

రంగోలీ, కంగనా ట్వీట్లపై భిన్న స్వరాలు వినిపించగా.. మధ్యలో పాత విషయం వెలుగులోకి వచ్చింది. కంగనా, సుమన్‌ల బ్రేకప్‌పై నటి కవితా కౌశిక్‌ స్పందించింది. సుమన్‌‌, అతని తండ్రి శేఖర్‌ సుమన్‌లు కంగనా క్షమాపణలకు అర్హులని తెలిపింది. సుమన్‌తో బ్రేకప్‌ సమయంలో అతని కుటుంబంపై కంగనా ఆమె సోదరి రంగోలీలు తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా అతని కుటుంబాన్ని ఎన్నో రకాలుగా బాధపెట్టిన తీరు హృదయ విధారకమని తెలిపింది.

ఆమెకు ధన్యవాదాలు..

ఆమెకు ధన్యవాదాలు..

ఇక దీనిపై సుమన్ స్పందిస్తూ.. కవిత మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు. అంతేగాక అప్పట్లో తనని విమర్శిస్తూ వచ్చిన వార్తలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. మామూలుగా ఇలాంటి ఫ్లాట్‌ఫామ్‌లో ఎక్కువ మంది తమ అభిప్రాయాలను చెప్పరని, చెబితే ఎలాంటి కామెంట్స్ వస్తాయో వారికి తెలున్నాడు.

క్షుద్రపూజలు కూడా..

క్షుద్రపూజలు కూడా..


ఓ రోజు తనను అర్దరాత్రి ఇంటికి పిలిచిందని తెలిపాడు. అర్దరాత్రి పన్నెండు గంటలకు తన అపార్ట్‌మెంట్‌లో ఏవేవో పూజలు చేసిందని తెలిపాడు. అంతా నల్లని వస్త్రాలతో నింపేసిందని, తనను కూడా మంత్రాలు చదవమని బలవంతం చేసిందని అన్నాడు. అలా చేస్తుండటంతో భయపడి బయటకు వచ్చానని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

సంతోషంగా ఉన్నా..

సంతోషంగా ఉన్నా..

కంగనాతో విడిపోవడంపై స్పందిస్తూ.. కంగనాతో విడిపోయే సమయంలో తనకు ఎవరూ మద్దతుగా లేరని అన్నాడు. అప్పుడు తాను కఠిన పరిస్థితులను చుశానని పేర్కొన్నాడు. తనను తన కుటుంబాన్ని చాలా బాధపెట్టిందని చెప్పుకొచ్చాడు. ఆమెతో విడిపోయాక జీవితం చాలా ఆనందంగా ఉందని అయినా..అవన్నీ మరిచిపోయి జీవితంలో చాలా ముందుకు వెళ్లానని తెలిపాడు. రాజ్: ది మిస్టరీ కంటీన్యూస్ అనే సినిమాతో వీరిద్దరు కలిశారు.

More from Filmibeat

Read more about: adhyayan suman kangana ranaut
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X