Adipurush: ప్రభాస్ సినిమాలో మార్పులు.. వామ్మో అన్ని కోట్లు ఖర్చు వృథా

టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సందడి చేసి.. కొంత కాలంగా పాన్ ఇండియాపై దండయాత్ర చేస్తోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తనదైన శైలి సినిమాలతో అలరించిన అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం భారీ బడ్జెట్ మూవీల్లోనే నటిస్తున్నాడు. ఇలా ఇప్పుడు చేతిలో నాలుగైదు సినిమాలను పెట్టుకుని ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఇక, ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న సినిమాల్లో పౌరాణిక కథతో వస్తున్న 'ఆదిపురుష్' ఒకటి. నేరుగా హిందీలో రూపొందుతోన్న ఈ మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డ విషయం తెలిసిందే.

బాలీవుడ్‌లో హిస్టారికల్ మూవీస్ డైరెక్టర్‌గా గుర్తింపును తెచ్చుకున్న ఓం రౌత్ రూపకల్పనలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమానే 'ఆదిపురుష్'. దీని ద్వారా మన స్టార్ హీరో బాలీవుడ్‌లోకి నేరుగా అడుగు పెడుతున్నాడు. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో.. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లుగా చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. విజువల్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ముగిసింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

Adipurush Movie Unit Spends Extra Budget for VFX

కొద్ది రోజుల క్రితం వచ్చిన 'ఆదిపురుష్' మూవీకి సంబంధించిన టీజర్‌పై చాలా అభ్యంతరాలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర యూనిట్ కొన్ని పాత్రల విషయంలో మార్పులు చేయాలని భావించినట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే రావణాసురుడు, వానర సైన్యానికి సంబంధించిన సీన్స్‌లలో వీఎఫ్ఎక్స్ ద్వారా మార్పులు చేస్తున్నారట. ఇందుకోసం 'ఆదిపురుష్' మూవీ యూనిట్ అధనంగా మరో నాలుగైదు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందని తెలిసింది. దీంతో ఇప్పుడీ న్యూస్ దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతోంది.

'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక, దీన్ని వచ్చే ఏడాది జూన్ 16న విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X