Adipurush Release date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఆదిపురుష్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా తానాజీ ఫేం, బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ కాంబినేషన్‌లో మూవీ సెట్ అయిందనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ మారింది. అంతగా పాపులారిటీ లేని ఓం రావత్ లాంటి దర్శకుడితో ప్రభాస్ పనిచేస్తున్నారనే వార్త చర్చనీయాంశమైంది. కొద్ది నెలల క్రితం రిలీజ్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో గురువారం 19వ తేదీ రోజున ఆదిపురుష్ యూనిట్ మరో అప్‌డేట్ ఇచ్చింది. అదేమిటంటే..

Recommended Video

Prabhas, Saif Ali Khan-Starrer 'Adipurush' To Release In August 2022
2022లో విడుదల చేస్తాం

2022లో విడుదల చేస్తాం

ఆది పురుష్ చిత్రాన్ని తెలుగు, హిందీలో ఏకకాలంలో చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత తమిళ్, మలయాళం, కన్నడ, విదేశీ భాషల్లో డబ్బింగ్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ 2021లో మొదలుపెట్టి.. 2022లో విడుదల చేస్తున్నట్టు ఆది పురుష్ యూనిట్ ప్లాన్ చేస్తున్నది

 2022 ఆగస్టు 11వ తేదీన రిలీజ్

2022 ఆగస్టు 11వ తేదీన రిలీజ్

ఆది పురుష్ చిత్ర యూనిట్ తెలిపిన ప్రకారం.. 2022 ఆగస్టు 11వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ చిత్ర యూనిట్ పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నట్టు స్పష్టమైంది. లాక్‌డౌన్ కాలంలో అధికారికంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించి ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేయడం దేశ సినీ చరిత్రలో చర్చనీయాశంగా మారింది. ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నది.

అయోధి అని టైటిల్ పెట్టాలనుకొన్నాం

అయోధి అని టైటిల్ పెట్టాలనుకొన్నాం

ప్రభాస్ కెరీర్‌లో 22వ చిత్రంగా రూపొందుతున్న ఆది పురుష్ సినిమాకు తొలుత అయోధి అనే పేరును పెట్టాలనుకొన్నాం. రాముడి జన్మస్థానం అయోధ్యను స్మరించుకొనేలా ఆయోధి టైటిల్‌గా అనుకొన్నాం. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పేరును ఆదిపురుష్‌గా మార్చాం అని దర్శకుడు ఓం రావత్ తెలిపారు.

బాలీవుడ్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా

బాలీవుడ్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా

ఆది పురుష్ చిత్రంలో తెలుగు, హిందీ నటుల కలయికతో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్నది. టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రభాస్‌ను ఢీకొట్టేందుకు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా కనిపించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X