Adipurush మూవీలో ఆ సీనే హైలైట్: 15 నిమిషాలకే అన్ని కోట్లు ఖర్చా!

సుదీర్ఘ కాలం పాటు టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో హవాను చూపించి.. ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా తన మార్కును చూపిస్తూ దూసుకుపోతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి' సిరీస్ నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తోన్న అతడు.. ఏకధాటిగా భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. ఇలా ఇప్పుడు ఏకంగా నాలుగైదు సినిమాలను లైన్‌లో పెట్టుకుని ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఇక, ప్రస్తుతం ఇప్పుడు నటిస్తోన్న సినిమాల్లో 'ఆదిపురుష్' ఒకటి. నేరుగా హిందీలో రూపొందుతోన్న దీనిపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.

బాలీవుడ్‌లో హిస్టారికల్ మూవీస్ డైరెక్టర్‌గా పేరును సంపాదించుకున్న ఓం రౌత్ రూపకల్పనలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సినిమానే 'ఆదిపురుష్'. దీని ద్వారా మన స్టార్ హీరో బాలీవుడ్‌లోకి నేరుగా అడుగు పెడుతున్నాడు. రామాయణంలో ఇప్పటి వరకూ ఎవరూ చూపించని పాయింట్‌తో.. చెడు మీద మంచి ఎలా గెలిచింది అన్న కాన్సెప్టుతో ఈ సినిమా రూపొందుతోన్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది. విజువల్ వండర్‌గా వస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ చాలా రోజుల క్రితమే ముగిసింది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి.

 Adipurush Team Spends Rs 12 Crore for Pre Climax Sequence

ప్రభాస్ - ఓం రౌంత్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'ఆదిపురుష్' మూవీని అత్యున్నత విజువల్ ఎఫెక్ట్స్‌తో భారీ బడ్జెట్‌ను కేటాయించి తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో వచ్చే ప్రీ క్లైమాక్స్ సీన్ ఎంతో హైలైట్‌గా ఉండబోతుందట. వానర సైన్యంతో ప్రభాస్ సముద్రాన్ని దాటే ఈ సన్నివేశం ఇండియాలో ఇప్పటి వరకూ ఎవరూ చూడని విధంగా క్రియేట్ చేస్తున్నారని తెలిసింది.

అందుకే దీని కోసం ఏకంగా రూ. 12 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిసింది. ఈ సీక్వెన్స్ దాదాపు 15 నిమిషాల పాటు ఉంటుందని కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అంటే.. ఒక్క నిమిషానికి ఒక్కో కోటి అన్నట్లుగా ఖర్చు చేస్తున్నారన్న మాట.

 Adipurush Team Spends Rs 12 Crore for Pre Climax Sequence

'ఆదిపురుష్' మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తోన్నారు. ఈ సినిమాను టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X