Adipurush: క్షమాపణ చెప్పిన ఆదిపురుష్ రైటర్.. అసలు అతడే ఏం చేశాడో తెలిస్తే!
దాదాపు రెండు మూడు నెలల నుంచి దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోయిన సినిమాల్లో 'ఆదిపురుష్' ఒకటి. అంతలా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఈ సినిమా గురించే చర్చ జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా ఆరంభం నుంచే ఎన్నో వివాదాలకు కారణం అయింది. రిలీజ్ తర్వాత ఈ చిత్రంపై మరిన్ని విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా డైలాగ్ రైటర్ కొద్ది రోజుల క్రితం ఏకంగా హనుమంతుడిపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో తాజాగా అతడు ఈ వివాదంపై స్పందించాడు. ఆ వివరాలు మీకోసం!
ఆదిపురుష్‌గా వచ్చిన ప్రభాస్ : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో వచ్చిన చిత్రమే 'ఆదిపురుష్'. ఇందులో అతడు రాముడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదుత్తా హనుమంతుడిగా చేశారు. అజయ్ - అతుల్ దీనికి సంగీతం అందించారు. దీన్ని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మించారు.


రైటర్ కామెంట్లతో మరో రచ్చ : ఒకవైపు 'ఆదిపురుష్' మూవీపై విమర్శలు వెల్లువెత్తిన సమయంలోనే ఈ సినిమాకు డైలాగ్ రైటర్‌గా పని చేసిన మనోజ్ ముంతాషిర్ కొన్ని వివాదాస్పద కామెంట్లు చేశాడు. ముందుగా ఈ సినిమాకు రామాయణానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి అతడు ట్విస్ట్ ఇచ్చాడు. అంతేకాదు, అసలు హనుమంతుడు దేవుడే కాదు అంటూ సంచలన వ్యాఖ్యలతో దుమారం రేపాడు.

వ్యతిరేకత... సారీ చెప్పాడు : హిందూ దేవుడైన హనుమంతుడిపై మనోజ్ ముంతాషిర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా అతడు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు అతడిపై ఫిర్యాదును కూడా ఇచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషిర్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ పోస్ట్ చేశాడు.



Click it and Unblock the Notifications











