హాట్ హాట్‌గా అదితిరావు.. నెటిజెన్ల సమ్మోహనం..
చెలియా, పద్మావతి చిత్రాలతో ప్రతిభావంతురాలైన నటిగా పేరు తెచ్చుకొన్న అదితిరావు హైదరీ తాజాగా సమ్మోహనం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నారు. సమ్మోహనం చిత్రంలో అదితిరావు నటనపై విమర్శకుల ప్రశంసలు గుప్పించారు. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్న చిత్రంలోనూ, అలాగే మహేష్ బాబు చిత్రంలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
ఇదిలా ఉండగా, మాక్సిమ్ మ్యాగజైన్ జరిపిన ఫోటోషూట్‌లో అదితిరావు హాట్ హాట్‌గా కనిపించింది. దేశంలోని 100 మంది హాట్ హీరోయిన్లను ఎంపిక చేసే క్రమంలో అదితితో ఈ ఫోటో షూట్ నిర్వహించింది. అదితి ఫోటోషూట్‌పై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.



Click it and Unblock the Notifications











