కరోనా విజృంభణ.. సైఫ్ అలీ ఖాన్ సినిమా వాయిదా
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల లాక్ డౌన్ పెట్టకతప్పని పరిస్థితులు ఏర్పుడుతున్నాయి. ఇదే క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ విద్యా సంస్థలను మూసివేసేస్తున్నారు. ఇక మళ్లీ మునుపటిలానే కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను అమలు చేసే అవకాశాలున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ థియేటర్ల ఉనికిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఎరుపు చీరలో కనువిందు చేసిన జాక్వలైన్ ఫెర్నాండేజ్..
పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియడం లేదనే ఉద్దేశ్యంలో బాలీవుడ్‌లో రాబోతోన్న ఓ పెద్ద సినిమాను నిర్మాతలు వాయిదా వేసేశారు. బంటీ ఔర్ బబ్లీ సినిమాకు సీక్వెల్‌గా రాబోతోన్న పార్ట్ 2ను వాయిదా వేస్తోన్నట్టు నిర్మాత ఆదిత్య చోప్రా ప్రకటించారు. మామూలుగా అయితే బంటీ ఔర్ బబ్లీ ఏప్రిల్ 23న విడుదల కావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్లకు జనాలు వచ్చేలా లేరు.

అందుకే అందరికీ సరైన సమయంలో మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంలోనే సినిమాను వాయిదా వేస్తోన్నట్టు తెలిపారు. బంటీ ఔర్ బబ్లీ సినిమాను తెలుగులో ఇలియానా, తరుణ్ జంటలుగా భలే దొంగలు అంటూ రీమేక్ తీశారు. ఇప్పుడు హిందీలో మళ్లీ ఆ సీక్వెల్‌ను ప్లాన్ చేశారు. ఇందులో రాణీ ముఖర్జీ, సైఫ్ అలీ ఖాన్ నటించారు. కొత్త జంటలుగా సిద్దాంత్ చతుర్వేది, శార్వారిని వెండితెరకు పరిచయం చేయబోతోన్నారు.


Click it and Unblock the Notifications











