Just In
- 1 min ago
మనం 2లో మరో ఇద్దరు యువ హీరోలు.. స్టోరీ ఎంతవరకు వచ్చిందంటే?
- 10 min ago
విడుదలకు ముందే బయటకు: ‘ఆచార్య’ టీజర్ హైలైట్స్ ఇవే.. చివరి ఐదు సెకెన్స్ అరాచకమే!
- 51 min ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 1 hr ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
Don't Miss!
- News
మదనపల్లె కేసు రిమాండ్ రిపోర్ట్ లో షాకింగ్ అంశాలు .. పూజ గదిలో బూడిద, కత్తిరించిన జుట్టు, గాజు ముక్కలు
- Sports
మహ్మద్ సిరాజ్‌కు నాతో చీవాట్లు తినడం ఇష్టం: టీమిండియా బౌలింగ్ కోచ్
- Automobiles
ఇండియా To సింగపూర్ : బస్‌లో వెళ్లి వచ్చేద్దామా.. మీరు విన్నది నిజమే.. చూడండి
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మద్యం తాగించి.. ఫొటోలు తీశాడు.. లైంగిక దాడి కేసులో నటుడికి..!
బాలీవుడ్ నటుడు ఆదిత్యా పంచోలికి ఊరట లభించింది. హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఓ నటి తనపై లైంగిక దాడి చేశారంటూ ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముంబై కోర్టులో విచారణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆదిత్య పంచోలికి మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 3 తేదీ వరకు అరెస్ట్ చేయకూడదని ఆదేశించింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

నాపై లైంగిక దాడి చేశారంటూ
నటుడు ఆదిత్య పంచోలి 2004, 2006 సంవత్సరాల్లో తనపై లైంగిక దాడి జరిపారు. తన మద్యం తాగించి శారీరకంగా అనుభవించేందుకు ప్రయత్నించాడు. పలు సమయాల్లో తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను బయటపెడుతానని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు అని బాధిత నటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

హెచ్చరించినా.. ప్రవర్తన మార్చుకోలేదని
గతంలో కూడా తాను ఆదిత్య పంచోలిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. కానీ అతడిని హెచ్చరించి వదిలేశారు. కానీ తన ప్రవర్తనను మార్చుకోలేదు. తనపై వేధింపులను కొనసాగించాడు. తనకు ప్రాణాపాయం ఉన్నందున్న మళ్లీ ఫిర్యాదు చేయడానికి బయపడ్డాను. కానీ అతడిపై బెదిరింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేక ఫిర్యాదు చేశాను అని బాధితురాలు వెల్లడించారు.

ఆదిత్య పంచోలిపై ఎఫ్‌ఐఆర్ నమోదు
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఆదిత్య పంచోలిపై జూన్ 28న వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 376 (రేప్), 328 (బలవంతంగా మద్యం సేవింపజేసిన కుట్ర) 384 (డబ్బు లాగే ప్రయత్నం), 341 (మోసం, 342, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాంతో ఈ కేసులో ఆదిత్య పంచోలి కూరుకుపోయాడు.

తప్పు చేయలేదు: ఆధారాలున్నాయంటూ
తనపై వచ్చిన ఆరోపణలపై, కేసుపై ఆదిత్య పంచోలి స్పందించాడు. నాపై తప్పుడు కేసు నమోదైంది. నేను తప్పేమీ చేయలేదని చెప్పడానికి నా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాతే నన్ను పోలీసులు సంప్రదించారు. అయినా నేను పోలీసులకు, విచారణకు సంప్రదిస్తాను అని ఆదిత్య పంచోలి వెల్లడించారు. ఈ క్రమంలో వెర్సోవా పోలీసులు ఆదిత్య పంచోలి నుంచి మే 12న స్టేట్‌మెంట్ తీసుకొన్నారు.